కెసిఆర్..నీకు దమ్ముంటే దళితున్ని సీఎం చేసి ధర్నాలు చేయి:వైఎస్ షర్మిల

హైదరాబాద్:ఆఖరి గింజ వరకు కొంటానన్న కెసిఆర్ మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్న అంటూ వైఎస్ షర్మిల నేడు కీలక వ్యాఖ్యలు చేసారు.కెసిఆర్ కు మూడు వారాలు సమ యం ఇస్తున్న అని ఆఖరి గింజ వరకు కొనాలి అంటూ ఆమె డిమాండ్ చేసారు.లేదంటే నిరాహార దీక్షకు కాదు ఆమరణ నిరాహార దీక్ష కు కూర్చుంటా అని హెచ్చరించారు.ఆమరణ ని రాహార దీక్ష కు కూర్చోవడం కెసిఆర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది అని అన్నారు.మమ్మల్ని ఆపడం ఎవరితరం కాదు అని ఆమె స్పష్టం చేసారు.నన్ను చూస్తుంటే కెసిఆర్ కు ఎందు కు అంత ఉలికిపాటు అని ఆమె ప్రశ్నించారు.లోటస్ ఫాండ్ లో మిగిలిన రెండు రోజులు దీక్ష చేయాలనీ భావించా,కానీ పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు అని ఆమె మండిపడ్డారు.స్టేజ్ వేయనివ్వడం లేదు,వేసిన తీసేస్తున్నారని ఆరోపణలు చేసారు.తెలంగాణాలో పొలిసు జులుం నడుస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.వరి కొనడం కెసిఆర్ కు చేత కాలేదని ఆమె మండిపడ్డారు.పాలనా చేతకాక ధర్నాలు చేస్తున్నాడు అని విమర్శలు గుప్పించారు.కెసిఆర్ మెడలు వంచైనా సరే వడ్లు కొనేలా చేస్తా అని ఆమె స్పష్టం చేసారు.పెద్ద దొర చిన్న దొర ఇద్దరు మాటలు చెప్పే మొనగాళ్లే కానీ పూటకు భత్యం ఇవ్వలేని వారు అని ఆమె ఆరోపణలు చేసారు.ఉద్యోగాలు,రుణమాఫీ,ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి,కేజీ టు పిజి, డబుల్ బెడ్ రూమ్,మూడెకరాల భూమి ఇలా మీరు నిలబెట్టుకోలేని హామీలపై చేయలేకపోయామని ధర్నాలు చేయండి అని హితవు పలికారు.కెసిఆర్ రాజీనామా చేసి దళితున్ని సీ ఎం చేసి కెసిఆర్ ధర్నాలు చేసుకుంటూ కూర్చోవాలి అని విమర్శలు చేసారు.వరి కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా కెసిఆర్ కు లేదు అన్నారు.ఇది వై ఎస్ ఆర్ రక్తం అని తనను ఆపడం కేసీఆర్ తరం కాదన్నారు.72 గంటలు నేను దీక్ష చేస్తే నీకు భయం ఎందుకు అని నిలదీశారు ఆమె.కెసిఆర్ కు ఆడవారి గండం ఉంది అని అన్నా రు.అందుకే నన్ను ఆపాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here