హైదరాబాద్:కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్ వైద్యులు నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు.రేపట్నుంచి ఈ నెల 26 వర కు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు.తమకు పెంచిన స్టైఫండ్,కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపట్నుంచి నల్ల బ్యాడ్జీలతో వి ధుల్లో పాల్గొంటామని తెలిపారు.ఈ నెల 26 తర్వాత విధులు బహిష్కరించనున్నట్టు హెచ్చరించారు.ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్లకు గాంధీ,టిమ్స్,కింగ్ కోఠి జూ నియర్ వైద్యులు నోటీసులు ఇచ్చారు.