హుజూరాబాద్ నియోజకవర్గంలో..టీఆర్ఎస్ కు పలువురు రాజీనామా

కరీంనగర్/జమ్మికుంట:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి.ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే.ఆయన నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించిన అనంతరం రాజకీయాలు మారిపోతున్నాయి.తాజాగా ఐదు మండలాల టీఆర్ఎస్వీ అధ్యక్షులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.గురువారం జ మ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.మూకుమ్మడిగా 300 మంది పార్టీ సభ్యత్వానికి రాజీ నామా చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈటెలను వేధించాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన వ్యక్తి ఈటెల అని,ఆయన వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.ఈటెల మీద లేని పోని ఆరోపణలు వేసి కావాలని పార్టీ నుండి బయటకు పంపించారని ఆరోపించారు.మంత్రులు గంగుల కమాలాకర్,హరీష్ రావు,ఎరబెల్లి దయాకర్ రావు ఇతరులు ఎంత మంది వచ్చినా ఈటెలకు ఏం కాదన్నారు.ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రులు బెదిరించినా ఈటల వెనుక అడుగు వేయని వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలని హిత వు పలికారు.హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట,ఇల్లందకుంట,హుజురాబాద్,వీణవంక,కమలాపూర్ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ యూత్ విభా గానికి చెందిన సుమారు వంద మందికిపైగా యువ నాయకులు గురువారం గాంధీ చౌరస్తా వద్దకు చేరుకుని రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా జై ఈటెల అంటూ నినాదాలు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద సంఖ్యలో గుమికూడటం సరికా దని తెలిపారు.అయినప్పటికీ వారంతా ఈటలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై టీఆ ర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here