నేను..సీఎం కేసీఆర్‌ను కలవను:ఈటల

హైదరాబాద్:వైద్యారోగ్య శాఖను తన నుంచి తప్పించి ముఖ్యమంత్రికి బదిలీ చేయడంపై ఈటల రాజేందర్ స్పందించారు.ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.తన నుంచి ఆ శాఖను తొలగించినందుకు సీఎం కేసీఆర్‌కు ఈటల ధన్యవాదాలు తెలిపారు.ప్రజలకు మెరుగైన సేవలు అందాలనే ఉద్దేశంతో వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తీసుకున్నారని మంత్రి ఈటల చెప్పారు.తన వద్ద ఏ శాఖ లేకపోయినా కానీ ప్రజలకు సేవ చేస్తానని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు.ఏ శాఖ నైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందని రాజేందర్ వెల్లడించారు.ప్రణాళిక ప్రకారమే తనకు ఉద్వాసన పలికేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఈటల అనుమానం వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో వారు అంతకు అంతా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు తాను ప్రయ త్నం చేయబోనని స్పష్టం చేశారు.త్వరలోనే తన అనుచరులు నియోజకవర్గ ప్రజలతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ వెల్ల డించారు.నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని ఈటల మీడియాతో అన్నారు.శనివారం మధ్యాహ్నం అనూహ్య పరిణామం చోటు చేసుకున్న సంగతి తె లిసిందే.ప్రస్తుతం ఈటల రాజేందర్ వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు బదలాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు.సీఎం ప్రతి పాదన మేరకు ఈ మార్పు జరిగినట్లు గవర్నర్ కార్యదర్శి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ పరిణామంపైనే తాజాగా ఈటల స్పందించారు.మరోవైపు ఈటల రాజేందర్‌కు వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.ఆయన ఇంటికి భారీగా అభిమానులు కార్యకర్తలు తరలివస్తున్నారు.కేసీఆర్ కేటీఆర్ సంతోష్‌ కలిసి కుట్ర చే స్తున్నారని ఫైర్ అయ్యారు.కరోనాతో రాష్ట్రం ఆగమవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో పండుకున్నారంటూ విమర్శిస్తున్నారు.కేసీఆర్ కేబినెట్‌లో నిజాయతీగా పని చేసే వ్య క్తి ఈటల మాత్రమేనని కొనియాడారు.షామీర్‌పేట్‌ చౌరస్తాలో ఈటల అభిమానులు రాస్తారోకో నిర్వహించారు.దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.నాయకులు కార్యక ర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.తమ నేతను అక్రమంగా ఇరికిస్తున్నారని వారు ఆవేద న చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here