నేను..రాజకీయాల్లోకి రాను..హిమన్షురావు

హైదరాబాద్:భారతదేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు మెండు.ప్రాంతీయ పార్టీల విషయంలో ఇది మరీ ఎక్కువ.ఏ రాష్ట్రమైనా ప్రాంతీయ పార్టీల విషయంలో చాలా వరకూ వారసులే పార్టీ పగ్గాలను తీసుకుంటుంటారు.వారసులు లేని పక్షంలో కూడా పార్టీలో తొలిస్థానం బంధువులకే దక్కుతుంది.అది కూడా కుదరకపోతేనే బయటివారికి అవకాశం వస్తుంది.అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ కుటుంబంలో కూడా కేసీఆర్ అనంతరం కేటీఆర్‌కే ప్రథమ స్థా నం లభిస్తుంది.తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి ఆయనే అనే ప్రచారం కూడా ఉన్న సంగతి తెలిసిందే.కేసీఆర్,కేటీఆర్ తర్వాత వారసత్వం ప్రకారం మూడో తరంగా హి మన్షురావు రాజకీయాల్లోకి వస్తారనే ఊహ అందరిలోనూ ఉంది.కానీ ఆయన ప్రస్తుతం పాఠశాల విద్య చదువుతున్నారు.తాత తండ్రిలాగానే ఎప్పటికైనా హిమన్షు రా జకీయాల్లోకి వస్తారని వారిలాగే చక్రం తిప్పుతారని అందరూ అనుకుంటున్నారు.అయితే భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా?అసలు పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉందా? అనే అంశంపై హిమాన్షు క్లారిటీ ఇచ్చారు.ఈ మేరకు ట్వీట్ చేశారు.ట్విటర్ ద్వారా తన అభిమతాన్ని తెలిపిన హిమాన్షు తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు.తన కలలు లక్ష్యాలు తనకు ఉన్నాయని వాటిని సాకారం చేసుకోవాల్సి ఉందని హిమన్షు ట్వీట్‌లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here