హైదరాబాద్:ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు,కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ గాంధీ దవాఖానాను సంద ర్శించారు.గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు,ఎమర్జెన్సీ,ఔట్ పేషెంట్ వార్డులు సహా,పలు జనరల్ వార్డులలో సీఎం కలియతిరిగారు.బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు.వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.వారికి దైర్యం చెప్పారు.మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు.భోజనం ఎట్లా వున్నదని అడిగా రు.తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను సీఎం పరిశీలించారు.నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్ ను తయారు చేసే ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సీఎం ఆదేశాల మేరకు నెలకొల్పారు.గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో జూనియర్ డాక్టర్ల తో సీఎం మాట్లాడారు.ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు.వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు.ఈ సేవలను కొనసా గించండి.మీకు ఏ సమస్య వున్నా అవసరం వున్నా నన్ను సంప్రదించండి.నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాను అని సీఎం వారికి భరోసానిచ్చారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...