నల్గొండ:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.నల్గొండ స్థానంలో ఇప్పటి వరకు 67 మంది ఎలిమినేట్ అయ్యారు.ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా 25 వేల 530 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో స్థానంలో మల్లన్న,మూడో స్థానంలో ప్రొ.కోదండరామ్ ఉన్నారు.పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొత్తం లక్షా 17 వేల 386 ఓట్లు రాగా మల్లన్నకు 91,858 ఓట్లు,ప్రొ.కోదండరామ్‌కు 79,110 ఓట్లు పోల్ అయ్యాయి.రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పల్లాకు మెజా రిటీ తగ్గింది.పోటాపోటీగా దూసుకుపోతున్నారు మల్లన్న,కోదండరాం.రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 6586 ఓట్లు రాగా మల్లన్నకు 8563 ఓట్లు,కోదండంరాంకు 9038 వచ్చాయి.మల్లన్న కంటే 475 ఓట్లు ఎక్కువ సాధించారు కోదండరాం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు.