నీ కథ అంతా తెలుసు..గంగుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల

హుజురాబాద్:తెలంగాణ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ తన శాపనార్థాల చిట్టా విప్పారు.బిడ్డా గుర్తు పెట్టుకో అంటూ కరీంనగర్ శాసన సభ్యుడు పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ ఏమన్నారంటే ఇప్పుడు మాట్లా డుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి వారి బాధను పంచుకున్న వారా? ఇక్కడ ఎవరి గెలుపులో అయినా మీరు సాయం చేశారా ? తోడేళ్ళలా దాడులు చేస్తు న్నారు.మంత్రిగా సంస్కారం సభ్యత ఉండాలి.అంటూ గంగులపై విమర్శలు ఎక్కుపెట్టారు.బిడ్డా గుర్తు పెట్టుకో ఎవడు వెయ్యేళ్ళు బ్రతకరు.అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నవు.బిల్లులు రావు అని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు.కరీంనగర్ ను బొందల గడ్డ చేస్తున్నావు.అంటూ ఆరోపించారు.నువ్వు ఎన్ని టాక్స్ లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా? టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి.నీ కథ ఎందో అంతా తెలుసు.2023 తరువాత నువ్వు ఉండవు నీ అధికారం ఉండదు.నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది.అదే గతి నీకు పడుతుంది అంటూ గంగులపై పరోక్ష విమ ర్శలు చేశారు.2006 లో కరీంనగర్ లో ఎంపీ గా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు,వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు.ఇప్పుడు హుజురాబాద్ లో కూడా అదే జరుగుతుంది.ప్రజలు అమాయకులు కారు.సంస్కారం తో మర్యాద పాటిస్తు న్నసహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని ఈటల హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here