ఇవి తినండి..ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోండి..

0
430

ఆదిలాబాద్:వర్షాకాలపు సీజన్ ప్రారంభమైంది.దోమల వ్యాప్తికూడా విపరీతంగా ఉంటుంది.ఈ సమయంలో ఎక్కువగా డెంగీ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవిచూస్తుంటారు.ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పడు ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.ఒక్కోసారి ఈ ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.ప్లేట్ లెట్లు తగ్గుతున్న సమయంలో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.అయితే డెంగీ వచ్చిన సం దర్భంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గి పోకుండా ఉండాలంటే వైద్యులు ఇచ్చే మందులతోపాటు కొన్ని రకాల పండ్లు,ఆహార పదార్ధాలు తీసుకోవటం ద్వారా తగ్గుతున్నప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.ఇందుకు గాను ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలంటే ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సం ఖ్యను పెంచుకోవచ్చు.ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది.ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.మరి ముఖ్యంగా బొప్పా పం డ్లను తీసుకోవటం ద్వారా డెంగీ వచ్చి ప్లేట్ లెట్లు పూర్తిగా పడిపోయిన వారు త్వరగా కోలుకోవచ్చు.నిర్ణీత మోతాదులో బొప్పాయి రసం తీసుకున్నా ప్లేట్ లేట్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది.ఆకుపచ్చగా ఉండే కూరగాయలు,ఆకు కూరలు తినటం ఉత్తమం,తద్వారా రక్తం ఎక్కవగా ఉత్పత్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది.ఎండు ఖ ర్జూరం,కివీ పండ్లు,ఆప్రికాట్ పండ్లను తినటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్య పెరిగి వ్యాధి నయమౌతుంది.క్యారెట్,బీట్ రూట్ వంటి వాటిని తీసుకోవటం ద్వారా రక్తం వృద్ధి చెంది ప్లేట్ లెట్లు పెరుగుతాయి.వెల్లుల్లి దర్భాలను ఆహారంలో తీసుకోవటం వల్ల ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు.ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే అహార పదార్ధాలు తీసుకున్న ట్లైతే డెంగీ వచ్చిన సమయంలో ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చు.దీని వల్ల డబ్బు ఖర్చును తగ్గించుకోవటం తోపాటు మన ఆరోగ్యం కూడా మె రుగవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here