వీటిని తినండి..రక్తంలో ప్లేట్ లెట్స్ పెంచుకోండి..

మంథిని:మన శరీరంలో రక్త శాతం తగ్గిపోయినప్పుడు లేని పోనీ అనారోగ్యాలు వస్తాయి.అలాగే రక్తంలో ప్లేట్లెట్లు సంఖ్య అనేది తగ్గిపోతే ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంది.అందుకే ఆలా జరగకుండా ఉండేందుకు రోజు వారి ఆహారంలో కొన్ని రకాల పండ్లను కూడా చేరిస్తే ప్లేట్ లెట్స్ సంఖ్య అనేది పెరుగుతుం ది.అందుకనే రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్లు కొన్ని పండ్లను సూచించారు.రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్స్ సూచించిన పండ్లు దానిమ్మ.ఈ పండులో పాలీ ఫినోలిక్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.ఇవి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటి కలిగి ఉంటాయి.ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.ఈ జ్యూస్ ను ప్రతి రెండు గంటలకొకసారి తాగాలి.దానిమ్మలో విటమిన్ సి అధికంగా ఉం టుంది.విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో వ్యాధినిరోధకత పెంచడానికి సహాయపడుతుంది.రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి కివి ఫ్రూట్ కూడా తినా లి.కివి పండ్లలో విటమిన్ సి,విటమిన్ కె,విటమిన్ ఇ,ఫొల్లెట్,పొటాషియంలు అధికంగా ఉన్నాయి.ఈ పండులో యాంటీఆక్సిడెంట్,ఫైబర్ ఎక్కువ.కివి ఫ్రూట్ లో న్యూ ట్రీషియన్స్ అధికంగా ఉంటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.కివి పండ్లలో ఉండే పొటాషియం,శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.అలాగే బొప్పాయి లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఈ ఫ్రూట్ లో విటమిన్స్ ,ఫొల్లెట్,ఫైబర్,పొటాషియంలు ఎక్కువ.బొప్పాయిలో ఉండే న్యూట్రీషియన్ బెనిఫిట్స్ విటమిన్ సి ని పెంచుతుంది.ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది.ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.బొప్పాయి గాయాలను మాన్పుతుంది.డేంగ్యూ ఫీవర్ ను తగ్గిస్తుంది.ప్లేట్ లెట్స్ పునరుత్పత్తి చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here