ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్

హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు.కాని వాటిని పూర్తి చేయడంలో ఆయన విఫలం అయ్యారు.దళిత ముఖ్యమంత్రి ఏమైంది?ప్రతి పౌరునికి రెండు బెడ్ రూమ్ ఏమైంది?ఎన్నికలప్పుడు మాత్రమే కెసిఆర్ కి ప్రజలు గుర్తుకు వస్తారు. ఆయన సచివాలయనికి రారు.ఇక్కడ కుటుంబపాలన నడుస్తుంది.1400 మంది విద్యార్ధులు ప్రాణాలు అర్పించింది కెసిఆర్ కుటుంబం కోసం కాదు.నిజాం పాలనలో ఉన్న తెలంగాణ సెప్టంబర్ 17న విముక్తి పొందింది.దానిని లిబరేషన్ డే చేస్తా అన్నాడు.కాని ఎంఐఎం కి ఒవైసీకి భయబడి చేయడం లేదు.వెనుకబడిన తరగుతులకు ఆయన చేసింది ఏమీ లేదు.కెసిఆర్ దయ దాక్షిన్యాలు అవసరం లేదు.రాజ్యాంగం ప్రకారం అందరికే సామాన్య హక్కులు అందాలి.రాష్ట్రం ఏర్పడితే అందరికీ సమాన హక్కులు వస్తాయి అన్నారు.కెసిఆర్ ఇచ్చిన హామీలు అన్నీ హామీలుగానే మిగిలిపోయాయి.మోడి అన్నీ రాష్ట్రాలకు సమానంగా నిధులు అందిస్తున్నారు.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,రోడ్లు,డిజిటల్ కనెక్షన్ వేల కోట్ల రూపాయలు ఇచ్చినా వాటిని సరిగ్గా వినియోగించడం లేదు.కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.40 వేల కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు 1,30,000 కోట్లకి ఎలా పెరిగింది,ఇందులో కమీషన్లు కెసిఆర్ కుటుంబానికి అందుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం 70 వేల ఇల్లు ఇచ్చింది కానే ఉపయోగించుకోలేదు.నరేగా పథకం కింద 15,738 కోట్లు ఇస్తే,పేదవారికి ఇవ్వకుండా అందులో 7500 కోట్లు దారి మళ్లించినది కెసిఆర్.
ప్రభుత్వం విఫలం అయ్యింది.ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది.అందుకే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనుకుంటున్నారు.కాంగ్రెస్ అసమర్ధత వల్ల 2018 లో టి ఆర్ఎస్ ప్రభుత్వం గెలిచింది.ఆ తరువాత ప్రజలు బిజేపి మీద విశ్వాసం ఉంచి 4 ఎంపి లు,దుబ్బాక,GHMC ఎన్నికలు ప్రజలు మార్పు కోరుకుంటున్నామని తేల్చి చెప్పారు.ఈటల రాజేందర్ మాట్లాడుతూ సామాజిక వర్గాల సమతుల్యతతో తొలిసారి మంత్రి వర్గ కూర్పు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి.80 మంది మంత్రుల్లో 53 మందికి బడుగు బలహీన వర్గాల,మైనారిటీ వారికి అవకాశం కల్పించారు.వీరిలో 27 మంది ఓబిసి,5 మైనారిటీ,12 మంది ఎస్సి,ST లో 8 మందికి మోడి చోటు కల్పించారు.అన్నీ వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కలిపించారు.తెలంగాణ రాష్ట్రం కూడా అణగారిన వర్గాల నిలయం కానీ అన్ని వర్గాల సమతుల్యత ఈ రాష్ట్రంలోలేదు.17 శాతం ఉన్న ఎస్సిలో ఒక్కరు మాత్రమే మంత్రిగా ఉన్నారు.అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో ఇక్కడ అవకాశం లేదు.మాటల్లో గొప్పగా,చేతల్లో అధః పాతాళం లో ఉంది తెలంగాణ లో కులాల చైతన్యం ఎక్కువ అన్నీ కులాల వారు బిజేపి కి మద్దతు ఇస్తున్నారు.కమలాపూర్ లో గౌడ ఘర్జన కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర సహాయమంత్రి మురళీధరన్ గారు వచ్చారు.ఆత్మ గౌరవం కోసం ఉన్నాం తప్ప డబ్బులకోసం కాదు అని మరో సారి గౌడన్న లు అందరూ చాటి చెప్పబోతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.హుజూరాబాద్ ఎన్నిక కెసిఆర్ కి ఒక వార్నింగ్ లాంటిది.ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారు.ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు.దళిత బందు ని బిజేపి స్వాగతిస్తుంది.కానీ దళితులతో పాటు ఇతర కులాలలో ఉన్న వారికి కూ డా 10 లక్షలు ఇవ్వాలి.గౌడలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి కూడా గౌడబంధు ఇవ్వాలి.గౌడలు సైకిల్ మీద తిరుగుతున్నారు.వారికి మోటారు వా హనాలు అందించాలి.40 శాతం మంది ఓబిసి మంత్రులు ఇచ్చిన ఘనత మోడి గారిది.ముదిరాజులకు,విశ్వకర్మ,విశ్వబ్రాహ్మణ లాంటి వారికి మంత్రి వర్గం లో స్థానం కల్పించారు.సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది మోడి విధానం అయితే కెసిఆర్ ది మేరా పరివార్ కా వికాస్ విధానం కెసిఆర్ పాలనలో నియంతృత్వం కొనసాగుతుం ది.తెలుగు ఆత్మ గౌరవం కోసం అప్పటి నాయకులు కొట్లాడారు.ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాట నడుస్తుంది.ఈ ఎన్నిక తెలగాణ చరిత్ర కు మలుపు కాబోతుంది. కెసిఆర్ కి హెచ్చరిక కాబోతుంది.కుటుంబ పాలనకు అంతం కాబోతుంది.స్వంత కుటుంబంలో కూడా కెసిఆర్ కి వ్యతిరేకత ఉంది,అది కూడ ఏదో ఒక రోజు బయటికి వస్తుంది.బిజేపితోనే తెలంగాణకి సంపూర్ణ వికాసం జరుగుతుంది.కరీంనగర్ జిల్లా బిజేపి అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,మాజీ ఎంపి,హుజూరాబాద్ ఎన్నికల బి జేపి ఇంచార్జ్ జితేందర్ రెడ్డి,మాజీ మంత్రి విజయరామారావు,మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ,కూన శ్రీశైలం గౌడ్,ధర్మారావు,బిజేపి సీనియర్ నాయకులు ప్రేమేంధర్ రెడ్డి,తుల ఉమ,వేణుగోపాల్ రెడ్డి,అశ్వథామరెడ్డి,రావు పద్మ,జోస్న,ఓయు జాక్ నేత సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here