కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం పీఠం నిలబెట్టుకున్నారు.దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.భవానీపూర్ ఉప ఎన్నికలో గెలుపొందారు.బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి,నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి,బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.బెంగాల్ లో వరుసగా పార్టీని మూడో సారి అధికారంలోకి తెచ్చి తాను మూడో సారి సీఎం పదవి దక్కించుకున్నారు.కానీ,అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.దీంతో ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.దీంతో భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభ న్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసారు.దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక రాగా టీఎంసీ అభ్యర్ధిగా మమత బెనర్జీ బరిలో దిగారు.బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చే సారు.ఇప్పటి వరకు మమతా సాధించిన విజయాల్లో అన్నింటికంటే ఎక్కువ మెజార్టీలో కంటే ఎక్కువ మెజార్టీ ఇక్కడే సాధించారు.2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమ త బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఓడించింది.34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.తాజాగా భవానీ పూర్ ఉప ఎన్నికలో తన రికార్డును తానే తిరగరాశారు.ఈ ఉప ఎన్నికలో ఆమె 58,389 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్,జంగీపూర్ శాసన సభ ని యోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి.ఈ నియోజకవర్గాల్లో కూడా టీఎంసీ ఆధిక్యంలో ఉంది.సెప్టెంబర్ 30న జరిగిన పోలింగ్ లో భవారీ పూర్ లో 53.32 శాతం పోలింగ్ న మోదైంది.అదే విధంగా శంశేర్ గంజ్ లో 78.60 శఆతం,జానీపూర:లో 76.12 శాతం పోలింగ్ నమోదలైంది.ఈ ఉప ఎన్నికలో సీపీఎం నుంచి శ్రీబిజ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు.ఇక్కడ టీఎంసీకి గట్టి పట్టు ఉండటంతో తొలి రౌండ్ నుంచి మమత ఆధిక్యత కొనసాగింది.చివరకు భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం పీఠం నిలబెట్టుకున్నారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...