సిటీ బస్సెక్కిన సీఎం

0
380

చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా బస్సులో ప్రయాణించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారు.రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు చెన్నైలోని కన్నాగి ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు స్టాలిన్.అక్కడ ఆరోగ్య సిబ్బంది,టీకా తీసుకునే వారి తో మాట్లాడి తిరుగు పయనమయ్యారు.ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సెక్కారు.ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్,కండక్టర్,ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యా రు.సీఎం స్టాలిన్‌తో ఫోటోలు,వీడియోలు తీసుకున్నారు.బస్సులు సకాలంలో వస్తున్నాయా సౌకర్యాలు ఎలా ఉన్నాయని సీఎం స్టాలిన్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here