సొంత ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్..

పాట్నా:మాట్లాడితే యూపీఏ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుంటారు బీజేపీ నేతలు.తమది నిఖార్సైన పాలన అని చెబుతుంటారు.అలాంటిది సొంత ప్రభుత్వం పైనే బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.బీహార్ రాష్ట్రంలోని నితీశ్ కేబినెట్లో ఉన్న బీజేపీ మంత్రులు అధికా రుల బదిలీల కోసం రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపించడం దేశరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.బీహార్ రాష్ట్రంలో ఇటీ వల అధికారుల బదిలీలు జరిగాయి.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ట్రాన్స్ ఫర్లలో ఏకంగా వంద కోట్లపైన చేతులు మారాయనే ఆరోపణలు వస్తున్నాయి.అయితే విపక్ష ఎ మ్మెల్యేలే కాకుండా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యే కూడా ఈ తరహా ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది.మొత్తం ఏడుగురు ఎమ్మెల్యే ఈ ఆరోపణలు చే యగా వీరిలో బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ కూడా ఉన్నారు.బీహార్ బదిలీల్లో తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు అధికారులు డబ్బులు ఇచ్చా రని అన్నారు.లంచాలు ఇచ్చిన వారికి బీజేపీ మంత్రులు అవసరమైన చోటికి ట్రాన్స్ ఫర్లు చేయించారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు.వారికి జ్జానేంద్ర సింగ్ కూడా జతకలిశారు.ఒక్కో అధికారి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు.దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.కాగా ఇదే విషయంలో ఓ మంత్రి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.తాను చెప్పినా వినకుండా తన శాఖలోని సుమారు 2 వేల మంది అధికారు లు ఉద్యోగులను తన శాఖ ముఖ్యకార్యదర్శి బదిలీ చేశారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here