హైదరాబాద్:నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.సొసైటీ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు.దుకాణాల కేటాయింపులు,నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అనిశా అధికారులు తనిఖీలు చేశారు.సొసైటీ లావాదేవీల వ్యవ హారాలపై ఆరా తీశారు.ఆరేళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఇటీవలే రాజీనామా చేశారు.ఈటల రాజీనామా అనంతరం సొసైటీలో అనిశా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఎలాంటి అవకతవకలు జరగలేదు సొసైటీ కార్యదర్శి:ఎగ్జిబిషన్ సొసైటీలో అనిశా అధికారులు సోదాలు చేయ డంపై సొసైటీ కార్యదర్శి ప్రభా శంకర్ స్పందించారు.సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.సొసైటీ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా జరుగుతు న్నాయని ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు.సొసైటీ రికార్డులను అనిశా అధికారులకు చూపిస్తున్నామన్నారు.సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలే దని ఈటల రాజేందర్‌కు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.సొసైటీలో 250 మంది సభ్యులుగా ఉన్నారన్నారు.సొసైటీలో అనిశా సోదాలు జరగ డం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
