బలుపా..అహంకారమా..?అంటూ బీజేపీ నేతల విమర్శలపై కేసీఆర్ సీరియస్

హైదరాబాద్:మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్,నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.వరి కొనుగోలు,పెట్రోల్ రేట్ పెం పు,రైతు చట్టాలు,బీజేపీ నేతల విమర్శలపై ఆయన ఘాటుగా,సీరియస్ గా స్పందించారు.ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.కల్తీ విత్తనాలమ్మినవారిపై పీడీ యాక్ట్ పెట్టడం తెలం గాణలో మాత్రమే ఉంది.కేజీ బాయిల్ రైస్ కూడా తీసుకునేది లేదని కేంద్రం చెప్పింది ధాన్యం కొనుగోలుపై కేంద్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది కేంద్రం కొనదు కాబట్టి వరిపంట వేస్తే రైతులు నష్టపోతారు.రాష్ట్రం వడ్లు కొనడం లేదంటూ బండి సంజయ్ చెప్పేది పచ్చి అబద్ధం.కేంద్రం కొనదు కాబట్టి వరి పంట వేస్తే దెబ్బ తింటం కేంద్రం మొదటినుంచి రైతు వ్యతిరేకమే మొన్నటి ఉప ఎన్నికల్లో దేశమంతటా బీజేపీని కొట్టుడు కొట్టిన్రు పెట్రోల్ రేట్ కొండంత పెంచి పిసరంత తగ్గించారు.కేంద్రం పెట్రోల్‌పై కేంద్రం సెస్ పూర్తిగా విత్ డ్రా చేసుకోవాలి.రాష్ట్ర వ్యాట్ లో మేం పైసా పెంచలే మేం రేట్ తగ్గించం.బండి సంజయ్ కేసీఆర్‌ను టచ్ చేసి చూడు సంజయ్ నన్ను అరెస్ట్ చేసి తెలంగాణలో బట్ట కడతావా.ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం ఇక త గ్గేదేలేదు నేను రంగంలోకి దిగిందే అందుకు నన్ను అరెస్ట్ చేస్తారా..?తమాషాగా ఉందా..?ఏం బలుపా…అంత అహంకారమా..?ఎంతొస్తే అంత మాట్లాడతారా?సోషల్ మీడియాలో ఎందు కీ విషప్రచారం ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపించండి తెలంగాణ ప్రజలు,రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకుంటానా ఢిల్లీ రైతులకు మద్దతుగా ఇక మేం ధర్నాలు చేస్తాం.రైతు వ్యతిరేక చ ట్టాలు విత్ డ్రా చేసుకోవాలి పెట్రో సెస్ వెంటనే విరమించుకోండి పెట్రోల్,వరిపై ఢిల్లీ బీజేపీ చెప్పేదొకటి స్టేట్‌లో సిల్లీ బీజేపీ చెప్పేదొకటి బండి సంజయ్ బీ కేర్ ఫుల్ అల్లాటప్పా గాళ్ల మాట పట్టుకుంటే తెలంగాణ ప్రజలు దెబ్బతింటారు బై ఎలక్షన్స్ అన్నాక ఓసారి గెలుస్తం ఓసారి ఓడుతం పిచ్చి కూతలు కూస్తే కేసులు పెడతాం జనంలో నిలబెడతాం ఎవరైనా నాలుకలు చీరే స్తాం.అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా దంచుతోంది.ఊళ్లు కడుతోంది ఏం చేస్తున్నారు?క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచంలో ఎక్కడైనా పెరిగిందా..?రాష్ట్రాలకు రావాల్సిన పెట్రో సెస్ ను కేంద్రం ఎగ్గొ ట్టింది బీజేపీ హయాంలో గంగలో శవాలు తేలినయ్ జీడీపీ నాశనమైంది రేపటినుంచి దేశంలో అగ్గి పెడతాం పెట్రోల్ ధర పెంచడం వల్లే పేదల కొంపలు ఆరిపోయాయి కిషన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడొద్దు రైతుల మీద కార్లెక్కించడమేనా మీ పని రైతుల బతుకులు కార్పొరేట్ల చేతిలో పెట్టారు వ్యవసాయం కార్పొరేటైజేషన్ చేసే భారీ కుట్ర జరుగుతోంది కేఆర్ఎంబీ,జీఆ ర్ఎంబీ దొంగ డ్రామా.నీళ్లతో వరి మాత్రమే కాదు ఏ పంటైనా వేసుకోవచ్చు తెలంగాణను ఆగం చేస్తే కేసీఆర్ మౌనం పాటించడు మేం పెట్రోల్ రేట్ పెంచలే తగ్గించే ప్రశ్నే లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here