కరీంనగర్:హుజురాబాద్ నియోజకవర్గం పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బందును హుజురాబాద్ లోవెంటనే అమలు చేయాలని,కెసిఆర్ నాలుగో తారీఖు నుం డి దళిత బంధు పంపిణీ చేస్తామని ప్రకటించినా ఇంత వరకూ ఏ ఒక్క దళితుడికి దళిత బంధు పథకం రాకపోవడాన్ని నిరసిస్తూ బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాదులో భా రీ డప్పుల మోత కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సోమిడివేణు ప్రసాద్ తెలిపారు.ఆదివారం రోజున బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యవర్గ,పదాది కారుల సమావేశం స్థానిక రేకుర్తి లో సాయి మహాలక్మి గార్డెన్స్ లో జరిగింది.ఇట్టి కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ప్రసాద్ మాట్లాడుతూ దళిత బంధు అమలు కో సం డప్పుల దరువు అనే కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా ల నుండి పదివేల డప్పుల తో కెసిఆర్ కి కళ్ళు తెరిపించి దళిత బంధు వెంటనే అమలు చేసే విధంగా మోత మోగించే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.కరీంనగర్ జిల్లా నుండి సుమారు 500 మంది డప్పు కళాకారులు ఇట్టి నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అబద్ధపు హామీలతో అవసరాలు తీర్చుకునేపరిస్థిని దళిత సమాజం గ్రహించిందన్నారు.హుజురాబాద్ ఎన్నికల అస్త్రంగా దళితబందు ప్రవేశపెట్టిన కెసిఆర్ వైఖరి దళిత సమాజం గ్రహించింది అన్నారు.రాబోయే రోజుల్లో దళితబందు ప్రతి దళిత కుటుంబానికి అందేవరకు బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో అలుపెరగనిపోరాటం ఉద్యమం చేస్తా మని దళిత బంధు రాష్ట్రమంతా అమలయ్యే వరకు విశ్రమించేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దళిత బంధు అమలు పోరాటంలో ప్రభుత్వంపై దండయాత్రకి దళిత జాతి ప్ర తిఒక్కరు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు పులమల్ల ప్రసాద్,తూర్పాటి రాజు,ఉపాధ్య క్షులు అభిలాష్,జిల్లా మల్లేశం,పరుశారం,బండారి వేణుగోపాల్,నిఖిల్,ప్రసన్న,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...