జగిత్యాల:రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు.తాము ఎలాంటి తప్పు చేయకున్నా అకారణంగా అరెస్ట్ లు చేయడం అన్యాయమని పలువురు రైతు సంఘాల నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే మెట్టుపెల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారా యణ రెడ్డి చెప్పును విసిరాడు.ముందస్తుగా అరెస్ట్ అయి మెట్టుపెల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న నారాయణ రెడ్డి స్టేషన్ ముందు నుండి కేటీఆర్ కాన్వాయ్ వెళ్లడం గమనించి చెప్పును విసిరాడు.వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...