నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్


వరంగల్:దేశం లోని వివిధ రాష్ట్రా లకు చెందిన ప్రముఖ యూనివర్సి టీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకోని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయా లకు సంబంధించిన ఇంట ర్,డిగ్రీ,పీజి,బి.టెక్ మరియూ చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు.వీరి నుండి పోలీసులు వివిధ విశ్వవిద్యాల యాలకు సంబంధించిన 153 నకిలీ సర్టిఫికేట్లు,7 రబ్బరు స్టాంపులు,మూడు కంప్యూటర్లు,ఒక ల్యాప్ టాప్,మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన హన్మకొండ కి చెందిన నారెడ్ల రమేష్,దేవరాజు సుధాకర్,దాస బిక్షామయ్య అనే ముగ్గురు వేరు వేరు గా ఎడ్యుకేషనల్ అకాడమీలను ఏర్పాటు చేసి యువకుల అవసరాలను అసరాలను అసరగా చేసుకోని ఎలాంటి పరీక్షలు రాయకుండానే దేశంలో వివిధ విశ్వవిధ్యాలయాలకు చెందిన యాజమాన్యంతో నిందితులు చేతులు కలిపి కావల్సినవారికి ఇంటర్,డిగ్రీ,పీజి,బి.టెక్ మరియూ చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి నకిలీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఒక లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకు విధ్యార్థులకు అంజేసేవారు.దేశాలలోని ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలుగా మార్కు ల మెమో లను సవరించి మార్కు లను శాతన్ని పెంచేవారు.అంతే కాకుండా దేశాలలోని ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలుగా మార్కుల మెమోల ను సవరించి మార్కుల శాతాన్ని పెంచుతున్నా రు. నిందితులు విధ్యార్థుల అవసరాల నిమిత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురినీ అదుపు లోకి తీసుకొని విచారణ చేస్తున్నామ న్నారు.దేశంలోని ఉత్తరప్రదేశ్,ఢిల్లీ,మహరాష్ట్ర,హిమాచల ప్రదేశ్,మధ్యప్రదేశ్,అరుణాచల ప్రదేశ్,గుజరాత్,పంజాబ్,సిక్కిం,జార్కండ్,ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సూమారు ముప్పైకి పైగా విశ్యావి ధ్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను అందజేయడం జరిగిందని ఇందులో 1.స్వామీ వివేకానంద యూనివర్సిటీ- మధ్య ప్రదేశ్,2.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఉత్తరప్రదేశ్,3.హిమా లయ యూనివర్సిటీ -హిమాచల ప్రదేశ్,4.మహాత్మాగాంధి కాశీ విద్యపత్ యూనివర్సి టీ- మహారాష్ట్ర,5.ఐ ఐ ఈ యూనివర్సిటీ-ఢిల్లీ,6.గీతం- వైజాగ్,7.నెఫ్ట్అరుణచల ప్రదేశ్,8.ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్-ఆంధ్ర ప్రదేశ్ కు విశ్వ విద్యాలయాలు వున్నాయని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్ జీ,ఎస్సై లవన్ కుమార్,ఏ ఏ ఓ సల్మాన్ పాషా,హెడ్ కానిస్టేబుల్ సోమలింగం,కానిస్టేబుళ్లు రాజేష్,అలీ,బిక్షపతి,శ్రీను,రాజు,శ్రవణ్ కుమార్ మరియూ హెూమ్ గార్డ్ విజయ్ లను ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here