అమిత్ షా సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్,ఏపీ డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ:వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ప్రారంభమైంది.దేశ రాజధాని ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోం శాఖ ఈ కీలక సమావేశం నిర్వ హించింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం ప్రారంభమైంది.ఈ సదస్సుకు వామపక్ష తీవ్ర ప్రభావితమైన పది రాష్ట్రాలు హాజరయ్యా యి.తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గడ్,ఒడిశా,మధ్యప్రదేశ్,బీహార్,ఉత్తర్ ప్రదేశ్,మహారాష్ట్ర,ఉత్తర్ ప్రదేశ్,జార్ఖండ్,వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు హాజరయ్యారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు.సమావేశానికి సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు.వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరి స్థితి,చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశంలో పాల్గొన్న వారు వివరించనున్నారు.హోంశాఖ సమావేశంలో తొలి అర్థభాగం భద్రతాపరమైన అంశాలపై చర్చ,రెండో అర్థ భాగంలో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరుగనుంది.మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లు,భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం,మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలు,మావోయిస్టుల నిధుల సమీకరణకు అడ్డుకట్ట,రాష్ట్రాల పోలీసులతో పాటు ఈడీ,ఎన్ఐఏ సంస్థల దర్యాప్తు,ప్రాసిక్యూషన్,ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు స్పె షల్ ఫోర్సెస్ విషయంలో రాష్ట్రాల మధ్య పరస్పర సహాయం,సమన్వయం అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కేం ద్ర హోంశాఖతో పాటు రవాణా,రహదారుల శాఖ,గ్రామీణాభివృద్ధి శాఖ,టెలీకాం సేవల కవరేజి కోసం టెలీకాం మంత్రిత్వశాఖ,ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ–గిరిజనుల కోసం ‘ఏకలవ్య’ స్కూళ్లు,రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజేంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను మూడేళ్ల క్రితం 100 నుంచి 70కి తగ్గించిన సంగతి తెలిసిందే.కేవలం 25 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.2014 నుంచి వామపక్ష తీవ్రవాద హింసాత్మ క ఘటనలు 47% తగ్గాయని వెల్లడిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here