న్యూఢిల్లీ:’సంయుక్త కిసాన్ మంచ్’నేడు పిలుపునిచ్చిన ‘భారత్ బంద్’దేశవ్యాప్తంగా మొదలైంది.కమ్యూనిస్టు పార్టీలతో పాటు బంద్‌కు మద్దతు తెలిపిన పార్టీల నాయకులు తెల్లవా రుజామునే డిపోల దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు.ఎక్కడికక్కడ బస్సులను నిలిపివేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.ఈ ‘భారత్ బంద్’ పిలుపునకు కాంగ్రెస్ సహా 19 రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ప్రత్యక్షంగా భారత్ బంద్‌లో పాల్గొననున్నట్లు స్పష్టం చేశాయిమోదీ ప్రభుత్వం తీసు కొచ్చిన సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఈ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే ఉద్దేశంతో భారత్ బంద్ నిర్ణయం తీసుకున్నాయి.సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ‘భారత్ బంద్’ మొదలైంది.దీంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా,మార్కె ట్లు,దుకాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.భారత్ బంద్ గురించి ‘సంయుక్త కిసాన్ మంచ్’ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,అన్ని విద్యా సంస్థలు,దుకాణాలు,పరిశ్రమలు,ప్రభుత్వ,ప్రైవేట్ రవాణా వ్యవస్థలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు రైతు సంఘా లతో పాటు ట్రేడ్ యూనియన్లు,చాంబర్ ఆఫ్ కామర్స్, విద్యార్థి సంఘాలు కూడా నిరసనల్లో పాల్గొనే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.అత్యవసర సేవల మినహా మిగతా అన్ని సేవలు ఈ బంద్ సమయంలో నిలిచిపోనున్నట్లు తెలిపారు.భారత్ బంద్‌కు మద్దతు తెలిపిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఒడిశాలో ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ ఓఎ స్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.ఏపీలో ప్రతిపక్ష టీడీపీ కూడా భారత్ బంద్‌కు సంఘీభావం తెలిపింది.అధికార వైసీపీ ప్రభుత్వం బంద్‌కు సం పూర్ణ మద్దతు ప్రకటించింది.వైసీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ సోమవారం తలపెట్టిన భారత్ బంద్‌కు తాను మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పడం గ మనార్హం.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా ‘భారత్ బంద్’కు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపింది.ఇక ఈ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతుండటంతో ఏపీలో పాఠశాలలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.ఇక తెలంగాణ విషయానికొస్తే సాగు చట్టాలను అధికార టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బంద్‌కు మద్దతిచ్చే విషయం లో మాత్రం ప్రస్తుతానికి స్పష్టత తెలుపకుండా మౌనం దాల్చింది.షర్మిల రాజకీయ పార్టీ అయిన వైఎస్సార్‌టీపీ ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు తెలిపింది.ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా యాజమాన్యం మాత్రం బస్సు సర్వీసులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.అయితే దూర ప్రాంతాలకు రాకపోకలు సా గించే బస్సులను,ఏపీ సర్వీసులను మాత్రం మధ్యాహ్నం వరకూ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.