కేసీయార్ పై అలిగి అమెరికా వెళ్లిన కవిత..?

హైదరాబాద్:ఇపుడిదే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.ఈనెల 30వ తేదీన జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమీషన్ శుక్రవారమే రిలీజ్ చేసింది.మూడునెలల నుండి నియోజకవర్గంలో ప్రచారంతో పర్యటనలతో హోరెత్తించేసిన టీఆర్ఎస్ నేతల హడావుడికి కమీష న్ జారీచేసిన కరోనా వైరస్ జాగ్రత్తలతో బ్రేకులుపడింది.సరే జోరుకు బ్రేకులుపడింది సరే మరి ప్రచారమైతే తప్పదు కదా.అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కేటీయార్ కవితను ప్రచారం నుండి కేసీయార్ దూరంగా పెట్టారట.ఇదే విషయమై అధికారపార్టీతో పాటు నియోజకవర్గంలో చర్చ బాగా జరుగుతోంది.కేసీయార్ ఎందుకు దూరం పెట్టారంటే వీళ్ళద్ద రిపైనా జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని రిపోర్టు వచ్చిందట.నిజానికి కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన మంట ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే.జనాల్లో పెరిగిపోతున్న మంట కు కేసీయార్ పాలన ఒక కారణమైతే కొడుకు కేటీయార్ కూతురు కవిత వ్యవహారశైలి రెండో కారణమంటున్నారు.వీళ్ళద్దరిపైనా బాగా అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి.ఉప ఎ న్నికలో వీళ్ళద్దరినీ ప్రచారంలోకి దింపితే అంతిమంగా జనాల వ్యతిరేకత పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాసయాదవ్ గెలుపుపై ప్రభావం చూపుతుందని కేసీయార్ కు రిపోర్టు వచ్చిందట.అందు కనే వీళ్ళద్దరిని దూరం పెట్టేసి మొత్తం బాధ్యతను మేనల్లుడు హరీష్ రావు మీదే కేసీయార్ మోపినట్లు ప్రచారం జరుగుతోంది.అంటే టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపు విషయంలో కేసీయార్ ఎ లాంటి ఛాన్స్ తీసుకోదలచుకోలేదని అర్ధమైపోతోంది.బీజేపీ తరపున పోటీచేస్తున్న మాజీమంత్రి ఈటల రాజేందర్ ను ఓడించటం ఇపుడు కేసీయార్ కు ప్రధాన టార్గెట్ అయిపోయింది. ఒకవేళ ఈటల గనుక గెలిస్తే కేసీయార్ ప్రిస్టేజ్ మొత్తం మూసీనదిలో కలిసిపోయినట్లే.ఇదే గనుక జరిగితే దళితబంధు పథకం కూడా వేస్టని తేలిపోతుంది.గడచిన మూడు నెలలుగా హుజూరాబాద్ లో చేసిన అభివృద్ధి ఖర్చుపెట్టిన కోట్లాది రూపాయలంతా వృధా అయినట్లే.అందుకనే కొడుకు కూతురు అయినా సరే హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారం నుండి కేసీ యార్ దూరం పెట్టేశారని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here