కేసీఆర్ నాపై దాడికి కుట్ర చేస్తున్నారు:ఈటల రాజేందర్

జమ్మికుంట:సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణ వంక మండలం నర్సింహులపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.డప్పు చప్పుళ్లు,మంగళహారతులతో గ్రామస్తులు ఈటలకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఆ రోజుల్లోనే నాపై దాడికి కుట్ర ఈటల రాజేందర్ అక్టోబర్ 13,14 తేదీలలో నామీద నేనే దాడి చేయించుకుంటా అని మంత్రులు అంటున్నారు.నా మీద దాడికి ఏమైనా కుట్ర చేస్తున్నారేమో అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.నామీద ఒక మంత్రిగారు మాట్లాడుతున్నారు.నేను చేతకాక ముఖం చెల్లక ఓడిపోతా ను అనే భయంతో నా కార్యకర్తలతో నేనే ఈ నెల 13,14 తేదీలలో దాడి చేయించుకొని కాళ్లు,చేతులకు కట్లు కట్టుకుని నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ ఓట్లు అ డుగుతారు అని మాట్లాడుతున్నారు.ఇదే చెన్నూరు ఎమ్మెల్యే కూడా కమలాపూర్‌లో మాట్లాడారు.కన్నీళ్లు పెట్టడం ఈటల రాజేందర్‌కి రాదు.అలాంటి పనికిమాలిన పనులు ఈటల చే యడు.నా మీద దాడి చేయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయి.మాజీ ఎంపీలకు,ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్‌మెన్లు ఉంటారు.నేను మాజీ మంత్రిని,ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను.నాకు మాత్రం ఒక్కడే గన్‌మెన్ ఉంటాడు.అయినా బయటికి పోవడానికి భయపడే వాడిని కాదు.అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.తన పేరుతో ఇప్పటి వరకు మూడూ దొంగ ఉత్తరాలు రాశారని.దళితబంధు ఆపాలని తాను రాసినట్లు ఓ ఉత్తరం సృష్టించారని ఈటల తెలిపారు.కాగా,అలాంటిదేమీ లేదని ఎన్నికల అధికారి ప్రకటించారు.దళితబంధు అందరికీ ఇవ్వాల్సిందే.వారికి ఆ నగదును స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి.నిరుపేదలందరికీ కులాలకతీతంగా పది లక్షలు ఇవ్వాలి.గతంలో కూ డా నేను సీఎంను క్షమించమని ఉత్తరం రాసినట్లు సృష్టించారు.అవసరమైతే చచ్చిపోతా తప్ప ఆయనకు లొంగిపోను.దమ్ముంటే డబ్బులు,సారా సీసాలు,పోలీసుల దుర్మార్గాలు,అధికా రుల దౌర్జన్యాలు పక్కనపెట్టి ధీరుడిలా తలపడు.మీరు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా లేదంటే సీఎం రాజీనామా చేయాలి.వడ్లు కొనేదిలేదన్న కేసీఆర్ వైపు ఉంటారా? కొనాల్సిందేనని చెప్పిన ఈటల వైపు ఉంటారా? సొంత స్థలాలలో ఇండ్లు కట్టుకునే జీవో ఇవ్వాలని అడిగే ఈటల వైపు ఉంటారా? ఏడేళ్లుగా ఒక్క ఇల్లు కూడా కట్టివ్వని కేసీఆర్ వైపు ఉంటారా?పింఛన్ ఇవ్వనన్నకేసీఆర్ వైపు ఉంటారా? ఇవ్వాలని కోరిన నా వైపు ఉంటారా? నాకు మీపై సంపూర్ణ విశ్వాసం ఉంది.చాలా మంది వృద్ధులు రాజేందర్‌కే ఓటేస్తామంటున్నా రు.కానీ,వాళ్లకు నాగుర్తు తెలియకపోవచ్చు.మీరే పువ్వు గుర్తుని గుర్తు చేసి చెప్పండి.నిన్నటి దాకా నాతో ఉన్న నాయకుడు మరొకరు వెళ్లిపోయారు.ఎవరు ఏ క్షణంలో వెళ్లిపోతారో తెలియడం లేదు.అయినా భయపడను.నాతో మీరున్నారు’ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here