హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు నాలుగు రోజులకు పైగా ఈ సోదాలు కొనసాగాయి.సంస్థ ఉత్పత్తి ప్లాంట్లలోనూ సోదాలు నిర్వహించారు.ఐటీ శాఖ సోదా ల గురించి ఆదాయపు పన్ను శాఖ లో పని చేసే అధికారులకే చాలా మందికి సమాచారం తెలియదు.బెంగుళూరు చెన్నై నుంచి వచ్చిన అధికారులు హైదరాబాద్ లో ఉన్న అధికారు లు సిబ్బందితో కలిసి సోదాల్లో పాల్గొన్నారు.సనత్ నగర్ లోని కార్పోరేట్ కార్యాలయంతో పాటుగా మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న సంస్థ ప్లాంట్లలోనూ సోదాలు చేసారు.అయితే,ఈ సోదాల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం.హెటిరో సంస్థలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది.రూ.550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు.రూ. 142 కోట్ల నగదు సీజ్ చేశారు.6 రాష్ట్రాల్లో హెటిరో సంస్ధల్లో 60 చోట్ల 4 రోజులపాటు ఐటీ దాడులు జరిగాయి.వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టడాన్ని గుర్తించారు.బీరువాల నిండా రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి.నిండా నోట్ల కట్టలున్న ఇనుప బీరువాలను అధికారులు సీజ్‌ చేశారు.చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని డబ్బు దాచినట్టు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారని అధికారులు వెల్లడించారు.ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని తెలిపారు.ఒక్కో అ ల్మారాలో రూ.5 కోట్ల నగదు దాచారని తెలిపారు.డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందని అధికారులే వెల్లడిస్తున్నారు.పెద్ద సంఖ్యలో లాకర్లు గుర్తించిన ఐటీ అధికా రులు మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్నారు.కరోనా సెకండ్ వేవ్ సమయంలో కీలకంగా మారిన రెమిడెసివిర్ ఇంజక్షన్ ఈ సంస్థ నుంచే ఉత్పత్తి అయింది.అదే విధంగా బెడ్ మీద తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా బాధితులకు ఇచ్చే ఒక ప్రముఖ టాబ్లెట్ సైతం ఇక్కడి నుంచే మార్కెట్ లోకి వచ్చింది.దీంతో ఆ సమయం నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికా రులు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది.హైదరాబాద్ తో పాటుగా ఆరు రాష్ట్రాల్లోని సంస్థకు చెందిన కార్యాలయాలు కీలక ఉద్యోగుల నివాసాల్లో చేసిన సోదాల్లో కీలకమైన డాక్యమెంట్స్ సై తం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here