హైదరాబాద్:దొర మాటిచ్చి నాలుగేళ్లైనా బీసీ పాలసీ పత్తా లేదని వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా విమర్శించారు.కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రో జులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండన్నారు.బీసీలంటే దొరగారి మీటింగ్‌కు జనాన్ని తీసుకొచ్చేవారు.ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారే తప్ప అధికారం లో పాలుపంచుకునే వారు,చట్టాలు చేసేందుకు అర్హులు కారు,అభివృద్ధికి నోచుకునే వారు కారని షర్మిల పేర్కొన్నారు.బీసీ సబ్ ప్లాన్ లేదు ఇండస్ట్రియల్ పాలసీ లేదన్నారు.నిధులు లే వు.ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని షర్మిల పేర్కొన్నారు.