హలో యాప్ లో హాయ్ అన్నాడు, పెళ్లిచేసుకుంటానని చెప్పి మరొకరితో వివాహామాడాడు, తాండ్రియాలలో ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి బైటాయింపు..

హలో యాప్ లో హాయ్ అన్నాడు, పెళ్లిచేసుకుంటానని చెప్పి మరొకరితో వివాహామాడాడు, తాండ్రియాలలో ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి బైటాయింపు..

హలో ఆప్ లో హాయ్ అన్నాడు,కొద్దికొద్దిగా పరిచం పెంచుకున్నాడు, మొదటగా స్నేహితుడిని అన్నాడు, ఆ తర్వాత ఐలవ్యూ చెప్పాడు, ఇద్దరి మనసులు కలిసాయి, మనుషులు కలుసుకున్నారు, 9 నెలలపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు,నిన్నుతప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అన్నాడు, ఓవైపు చాటింగ్ చేస్తూనె మరోవైపు వివాహాం చేసుకున్నాడు, విషయం తెలుసుకున్న ప్రియురాలు తన ఇంటికి వచ్చింది, తనను ఎందుకు మొసం చేసావు అని అడిగింది, నువ్వులేకుంటె నేను లేనని భీష్మించి కూర్చుంది, ఆ నోట ఈ నోట విషయం బయటకు పొక్కటంతో కొత్తగా పెళ్లిచేసుకున్న అమ్మాయితోపాటు తల్లిదండ్రులతో జంప్ జిలానీ అయ్యాడు ఆ ప్రేమికుడు, తనను పెళ్లిచేసుకొనెవరకు ఇక్కడినుండి కదిలేదిలేదని ఇంటిముందు టెంట్ వేసుకొని కూర్చుంది ప్రియురాలు ఈ సంఘటన జగిత్యాల జల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో చోటు చేసుకుంది, తాండ్రియాల గ్రామానికి చెందిన బిల్ల కిరణ్ కు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన పొలావేని శారదకు గత 9 నెలల క్రితం హలో ఆప్ లో పరిచం ఏర్పడింది, అదికాస్తా ప్రేమగా మారింది, పెళ్లిచేసుకుంటానని చెప్పటంతో ఇద్దరు కలిసి తిరిగారు, అయితె కిరణ్ గ్రామంలో ఉంటునే పెళ్లి సంభందాలు చూసుకున్నాడు, గత రెండు మూడు రోజుల క్రితం ఓ అమ్మాయితో వివాహం జరిగింది, విషయం తెలుసుకున్న శారద తాండ్రియాల గ్రామానికి చేరుకొంది, తనను మొసం చేశాడని గ్రామస్తులకు వివరించింది, తన వద్ద ఉన్న ఆదారాలన్ని చూపింది, విషయం తెలుసుకున్న కిరణ్ కుటుంబం ఇళ్లుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు, తనకు న్యాయం జరిగెవరకు తాను ఇక్కడినుండి కదలను అంటు ప్రియుడి ఇంటిముందు టెంట్ వేసుకొని బైటాయించింది, తనను పెళ్లిచేసుకోవాలని అంటుంది, అమెకు గ్రామ సర్పంచ్ ఆశ్రయం కల్పించాడు,రెండు రోజులుగా ప్రియుడి ఇంటిముందు కూర్చునె ఉంది, తనకు న్యాయం జరిగెవరకు కదలని చెపుతుంది..ప్రియుడు మాత్రం ఎక్కడ ఉన్నాడో తెలియదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here