సోమా పర్వతంపై మెట్‌పల్లి యువకుడు…1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య నమస్కారాలు చేసి ఔరా అనిపించాడు..

సోమా పర్వతంపై మెట్‌పల్లి యువకుడు…

అమెరికా దేశంలోని నార్త్‌ కరోలినాలోని సోమా పర్వతాన్ని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి యు వకుడు అధిరోహించాడు. 1,140 మీటర్ల ఎత్తులో 3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో 108 సూర్య నమస్కారాలు చేసి ఔరా అనిపించాడు. యోగా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలన్న సంకల్పంతో మెట్‌పల్లి మండ లం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్‌ ఎత్తయిన పర్వతాలపై, అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలో గురువారం సోమా పర్వతాన్ని అధిరోహించి, 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 23 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి తెలంగాణ సత్తాను చాటాడు. ఇప్పటికే తొమ్మిది ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన ప్రవీణ్‌.. 108 సూర్య నమస్కారాలు పూర్తిచేశాడు. గతంలో నేపాల్‌లోని మేరా పర్వతంపై చేసిన సూర్య నమస్కారాలకు ప్రవీణ్‌ ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సాధించాడు. ప్రవీణ్‌ ప్రస్తుతం గుజరాత్‌ రాష్ట్రం వడోదరలోని యోగానికేతన్‌లో యోగా శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. 108 పర్వతాలపై 108 సార్లు సూర్య నమస్కారాలు చేయాలన్నదే తన లక్ష్యమని ప్రవీణ్‌ పేర్కొంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here