రాయికల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా ధర్మపురి గౌడ్…
ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి రఘుపతి రెడ్డి

తాజాకబురు రాయికల్: రాయికల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు ముంజ ధర్మపురి గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పట్టణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ముంజ ధర్మపురి గౌడ్, ఉపాధ్యక్షులుగా కనికరపు లక్ష్మణ్ ,ప్రధాన కార్యదర్శిగా నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శిగా అనుపురం లింబాద్రి గౌడ్, కోశాధికారిగా కొడిమ్యాల రామకృష్ణ లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా పాత్రికేయుల అభివృద్ధి కోసం ప్రెస్ క్లబ్ తరపున నిరంతరం కృషి చేస్తానని అన్నారు.నాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వాసం లింబాద్రి, జవ్వాజి నర్సాగౌడ్, అల్లగొండ సుధాకర్ గౌడ్, జవ్వాజి శ్రీనివాస్ గౌడ్ , అందె రంజిత్,కోయల్ కర్ నవీన్,పడిగెల జితేందర్ రెడ్డి, గంగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.