మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీదే హవా..

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ఇక తిరుగులేదా?మొన్న పంచాయతీ,ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎలా లెక్కేయాలి?సాధరణంగా స్థానిక సంస్థ ల ఎన్నికల్లో అధికార పార్టీనే విజయం వరిస్తుంది.కానీ ఈ రేంజ్ లో ఎప్పుడూ ఏ ఫలితాలు రాలేదు.మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది అను కుంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దానికి రెట్టింపు ఫలితాలు సాధించారు.రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపిందని చెప్పాలి.ఇక ఏపీలో బ్యాలెన్స్ ఉన్నది పరిషత్ ఎన్నికలు మాత్రమే.ఆ ఎన్నికలు జరిగినా దాదాపు ఇలాంటి ఫలితాలే వస్తాయన్నది ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూ తెలిసిందే.మొన్న పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా గెలిచారని వైసీపీ నేతలు ప్రకటించారు.పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వైసీపీ జెండా క ప్పుకున్న నాయకుల ఫోటోల వివరాలను వెబ్ సైట్‌లో కూడా పెట్టారు.ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచింది.కార్పోరేషన్లను అయితే పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది.మున్సిపాలిటీల్లోనూ మైదుకూరు,తాడిపత్రి తప్ప అన్నిచోట్లా వైసీపీ జెండా పాతింది.ప్రస్తుతం వైసీపీ కి పడ్డ ఓట్లను లెక్క వేస్తే 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగినట్టు క్లియర్ గా తెలుస్తోంది.పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకున్నా మున్సిప ల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీదనే జరిగాయి.రాష్ట్రంలో 3.94 కోట్ల మంది ఓటర్లు ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 3.14 కోట్లమంది ఓటు వేశారు.ఈ ఎన్నికల్లో వైసీపీ 51 శాతం ఓట్లతో 80 శాతం సీట్లను గెలుచుకుంది.ఎన్నికలు ముగిసి ఎడాదిన్నర తర్వాత అధికార పార్టీకి కాస్త వ్యతిరేకత పెరుగుతుంది.దీంతో ఓటు బ్యాంక్ తగ్గాలి.కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే వైసీపీ ఓట్ బ్యాంక్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి.మున్సిపాలిటీలు,కార్పోరేషన్లలో కలిపి 77.16 లక్షల మంది ఓటర్లు ఉన్నా రు.మున్సిపాలిటీలలో 71 శాతం కార్పోరేషన్లలో 60 శాతం ఓటింగ్ జరిగింది.ఈ ఎన్నికల్లో వైసీపీ 90 శాతానికి పైగా సీట్లు సాధించింది.

Hawa is the ruling party in the municipal elections.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here