టి..బీజేపీపై పవన్ కళ్యాణ్ ఫైర్..టీఆర్ఎస్‌కు సపోర్ట్

హైదరాబాద్:జనసేన ఆవిర్భావ వేడుకలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.తెలం గాణలో జనసేన బలాన్ని ఆ పార్టీ చులకన చేసి మాట్లాడుతోందని ఆక్షేపించారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పనిచేసినా తమను పట్టించుకోలేదని తమ శ్రమ ను గుర్తించలేదని ఆరోపించారు.బీజేపీ కేంద్రం నాయకత్వం,అమిత్‌షా సైతం తమ పార్టీ బలాన్ని తెలుసుకుని,తమతో స్నేహాన్ని కోరుకుంటోంటే తెలంగాణ బీజేపీ నేత లు మాత్రం రాష్ట్రంలో తమను తీసివేసినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తెలంగాణలోని తమ పార్టీ నేతలు ఈ విషయంపై చాలా ఆవేదనగా ఉన్నారని తమ అత్మగౌరవాన్ని చంపుకోలేమని తన వద్ద వాపోయినట్టు గుర్తు చేశారు.వారందరి అభిప్రాయం మేరకు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తె,టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి మద్దతు తెలిపినట్టుగా స్పష్టం చేశారు.భూసంస్కరణలను అమలు కోసం సీఎం పదవినే పీవీ వదులుకొన్నారని పవన్ కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల నుంచి ఢిల్లీ వెళ్లినా ఆయనకు అక్కడ పెద్ద ప్రాధాన్యత దక్కలేదని అన్నారు.కాగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here