బంగారు తెలంగాణలో ” నిరు”ద్యోగం”మె ఉద్యోగమా?ఏటా ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు…

బంగారు తెలంగాణలో ” నిరు”ద్యోగం”మె ఉద్యోగమా?ఏటా ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు…..

తాజాకబురు సెట్రల్ డెస్క్:

రాష్ట్రం లో నిరుద్యోగుల బ్రతుకు ఆగమాగం. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం.
కానీ తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు మాత్రం ఏ లోటు లేదు.
చిన్న చిన్న నోటిఫికేషన్ల భర్తీలోనూ అంతులేని నిర్లక్ష్యమే. దీంతో నిరుద్యోగుల బతుకు గడవటం కష్టమై.. కొందరు కూలీ పనులకు వెళ్తున్నారు. సొంత రాష్ట్రమొస్తే ఇంటింటికో ఉద్యోగం వస్తుందని అనుకున్న నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. బంగారు తెలంగాణ ఏంటో కానీ.. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ తెలంగాణ ఏందో గానీ.. తమ కొలువులు ఊడగొట్టకుంటే చాలని ఉన్న ఉద్యోగులు కోరుతున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న వాళ్ళకు ఏటా నిరాశే ఎదురవుతోంది. ఆరేండ్ల నుంచి ఒక్క పెద్ద నోటిఫికేషన్ కూడా లేదు. ఏదో అప్పు డప్పుడు వేస్తున్న చిన్న చిన్న నోటిఫికేషన్లు కూడా ఏండ్ల కేండ్లు భర్తీకి నోచు కోవడం లేదు. రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగులున్నారు. ప్రతి సంవత్సరం వీరి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గవర్నమెంట్ డిపార్ట్ మెంట్లలో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదు. కనీసం టీచర్ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) అయినా నిర్వహించడం లేదు. మరోవైపు వివిధ డిపార్ట్ మెంట్లలో ఉన్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఇంటికి పంపించేస్తోంది. కొందరికి ‘నో వర్క్నో పే’ అంటూ సతాయిస్తోంది. VRO లను తొలగించి రెవెన్యూ శాఖ వెన్ను విరిచింది. తొలగించిన వారికి ఇప్పటివరకు ఏ శాఖలోనూ పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ రెవెన్యూ శాఖ నుండి జీతాలు చెల్లిస్తున్నారు. ఇది కూడా అదనపు భారమే.
తెలంగాణ లో రెండోసారి అధికారంలోకి వచ్చిన KCR ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోంది. సమ్మెలు చేసినా , తమ సమస్యలను విన్నవించినా ఉద్యోగాలనుండి పీకేస్తున్నారు.2018 ఎన్నికల హామీల్లోభాగమైన ‘నిరుద్యోగ భృతి’ అమలు చేస్తామన్న రాష్ట్రప్రభుత్వం.. ఆ మాటనే మరిచిపోయింది. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులే సుమారు 30 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులైన వారందరికీ ప్రతి నెలా రూ. 3,016 ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్అకౌంట్ బడ్జెట్ డ్జె లో ఈ స్కీమ్కు రూ. 1,810 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. తర్వాత ప్రవేశపెట్టిన రెగ్యులర్ బడ్జెట్డ్ లో అసలు నిధులే కేటాయించలేదు.రాష్ట్రంలో ఉపాధి హామీ లో పనిచేస్తున్న దాదాపు 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఏకంగా ఉద్యోగాల నుండి తొలగించి. ఓటు బ్యాంకు రాజకీయాలతో నిరుద్యోగులకు వల వేసి వారి ఓట్లు సంపాదించి ఇప్పడు వారిని నడిరోడ్డుపై నిలబెట్టింది. నిరుద్యోగ భృతి గురించే అసలు ఆశలు పెట్టుకోవద్దంటూ ప్రకటనలు చేయడం ఏరు దాటి తెప్ప తగలబెట్టినట్టుగా ఉంది. కరోనా ప్రభావం వల్ల ప్రయివేట్ రంగంలో కూడా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం తమకు కేటాయించిన నిధులను సంపూర్ణముగా ఉపయోగించుకొని హాయిగా ఉంది. నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే TSPSC పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఎలా ఉందో తెలుసుకోవాలని గంగాధర కిశోర్ కుమార్ ది.02.11.2020 న సహా చట్టం ప్రకారం కమీషన్ కు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వివరాలు,కమీషన్ లో ఉద్యోగుల జీతాలు, కమీషన్ గత 5 సంవత్సరాల కాలంలో విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్లకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఆన్ లైన్ లో చెల్లించిన ఫీజుల వివరాల కొరకు, కమీషన్ కార్యాలయం కు వచ్చే కరెంట్ బిల్తో వివరాలకు దరఖాస్తు చేసాడు. ఆ వివరాలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.
2015 లో కమీషన్ కు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 46కోట్ల 84లక్షల 95వేలు..
2016 లో 29కోట్ల 93లక్షల 93వేలు
2017లో 49కోట్ల 89లక్షల 49వేలు
2018లో 51కోట్ల 65లక్షల 47వేలు
2019లో 31కోట్ల 16లక్షల 80వేలు
2020లో 34కోట్ల 50లక్షల 63వేలు వెరసి మొత్తం 2015 నుండి 2020 వరకు ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కేటాయించిన బడ్జెట్ అక్షరాలా
244కోట్ల 12లక్షల 7వేల రూపాయలు..
ఇక కమీషన్ లో పని చేస్తున్న సిబ్బంది జీత భత్యాలు ఒక నెలకు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
చైర్మన్&మెంబర్స్ కు ఒక నెలకు 20లక్షల 41వేల 783రూ.లు

సెక్రటరీలకు ఒక నెలకు 2లక్షల 97వేల 933రూ.లు

ఆఫీసర్లకు ఒక నెలకు 17లక్షల 92వేల 330రూ.లు

సెక్షన్ ఆఫీసర్లకు 22లక్షల 38వేల 869రూ.లు

ASO లకు 12లక్షల 22వేల 358రూ.లు

జూ”అసిస్టెంట్లకు 1లక్ష 97వేల 323రూ.లు

4th క్లాస్ ఉద్యోగులకు 7లక్షల 21వేల 673రూ.లు

ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కు 15లక్షల 50వేల 361రూ.లు
మొత్తం ఒక నెలకు కమీషన్ లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించే జీతాలు అక్షరాల 1కోటి 62వేల 630రూ. లు ఒక సంవత్సరానికి ఈమొత్తం అక్షరాలా 12కోట్ల 7లక్షల 51వేల 560రూ.లు అదేవిధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వచ్చే ఒక నెల విద్యుత్ బిల్లు 2లక్షల 9వేల 119రూ.లు ఈవిధంగా కమీషన్ కు ఏ లోటు లేకుండా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. కానీ నిరుద్యోగులకు మాత్రం ఆశలు పెంచి ఆకాశంలో చుక్కలు చూపిస్తోంది. వివిధ నోటిఫికేషన్లకు చెల్లించే ఫీజులు నిరుద్యోగులకు శాపంగా మారాయి. చాలామంది ఫీజులు చెల్లించలేక అసలు అప్లై చేయడం కూడా మానేస్తున్నారు. 2015నుండి ఇప్పటివరకు నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెల్లించిన ఫీజులు అక్షరాలా 84కోట్ల 39లక్షల 92వేల 222రూ.లు ఈ మొత్తాన్ని నిర్ధ్యాక్షిణ్యంగా ప్రభుత్వం నిరుద్యోగుల నుండి ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఇంటికో ఉద్యోగం మాట దేవుడెరుగు జేబులో ఉన్న చిల్లర కూడా ప్రభుత్వం పకడ్బందీగా నిలువు దోపిడీ చేస్తూ తిరుపతి వేంకటేశ్వరున్ని దాటిపోయింది.
మళ్ళీ ఇప్పుడు లక్షన్నర ఉద్యోగాల భర్తీ పేరిట మరో దోపిడికి రంగం సిద్ధమైంది. పీకేసిన ఉద్యోగాల సంగతి ఏమైంది? తెలంగాణ లో జోన్ల లెక్క తేలనేలేదు.. ఎలా భర్తీ చేస్తారు? ఈ సారి ఫీజుల పెంపు ఎలా ఉండబోతోంది…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here