తాట్లవాయి గ్రామంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో శ్రీ సీతారమచంద్రస్వామి వారి పవిత్రోత్సవము శ్రీ విశ్వారణి సహిత అష్టోత్తర శతకుండాత్మక మహా విష్ణుయాగము…

తాజాకబురు రాయికల్ :జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం లో శ్రీ సీతారమచంద్రస్వామి వారి పవిత్రోత్సవము శ్రీ విశ్వారణి సహిత అష్టోత్తర శతకుండాత్మక మహా విష్ణుయాగము, ప్రభోదకిన్యాస హోమములు, రామాయణ హావనం, లక్ష్మీ నారాయణ హావనం, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి కార్యక్రమం మరియు శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో కరోన వలన ఈ సంవత్సరం కొన్నిరకాల ఉత్సవాలకు(రథోత్సవం)ఆటంకాలు కలగడం వలన ఏతత్ దోస నివారణరై సంపూర్ణ కరోన క్రిమినాశనార్థమై సమస్త జన కళ్యాణానికై రామునికి అష్టోత్తర శత కలశ స్నపన తిరుమంజనము లతో పవిత్రోత్సవం చేయడం జరిగింది.. విశేషద్రవ్యాలు సకల తీర్థజలంబులు దాదాపుగా నూట ఇరవై ఏడు రకాల ద్రవ్య కైంకర్యములతో అరుదైన అద్భుతమైన అధివాసములతో పవిత్రోత్సవం నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమం లో యజ్ఞచారి చిలకమర్రి వెంకట నరసింహ చారి, మరియు మర్రిపెల్లి రంగాచార్యులు, అర్చకులు శ్యామ సుందరచార్యులు, మురళి మనోహర చార్యులు, సముద్రాల అనంతచార్యులు,పొడిచేటి రామకృష్ణమ చార్యులు, చిలుకమర్రి పంరాంకుశా చార్యులు, చిలుక మర్రి మదన్ మోహన్, ఎంపిపి లావుడ్య సంధ్యారాణి సురేందర్ నాయక్, సర్పంచ్ రాగి సాగరిక, ఉపసర్పంచ్ ఆకుల మల్లేశం, TRS గ్రామ అధ్యక్షుడు రంజిత్, యూత్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, వార్డుమెంబర్లు గడ్డం రాజేశం, గుగ్గిళ్ల రాములు, కొండవేని గంగాధర్, కిరణ్, రెడ్డి, వెంకటేష్ గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here