జగన్ పాలనకే ప్రజలు పట్టం..

అమరావతి:ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది.అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగించింది.ఫ్యా న్‌ దూకుడుకు టీడీపీ,బీజేపీ,జనసేన అడ్రస్ గల్లంతయ్యాయి.మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.విశాఖపట్నం,విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు,విజయనగరం,ఒంగోలు,చిత్తూరు,తిరుపతి,కర్నూలు,వైఎస్సార్‌ కడప,అనంతపురం కార్పొరేషన్ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. ఇక 75 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ 73 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.టీడీపీ రెండు చోట్ల విజయం సాధించింది.పశ్చిమ గో దావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది.దీంతో మిగి లిన 11 కార్పొరేషన్‌లు,75 మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి.71 స్థానాలకు ఎన్నికలు జరగగా 69 స్థానాల్లో వైసీపీ గెలిచింది. రెండు స్థానాల్లో టీడీపీ గెలిచిం ది.కాగా పులివెందుల,పుంగనూరు,పిడుగురాళ్ల,మాచర్ల ఈ నాలుగు పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో ఉత్తరాంధ్ర,కోస్తా,రాయలసీమ ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం.దీంతో మూ డు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది.ఇక ‘ఫ్యాన్‌’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ,బీజేపీ,జనసేన ఉనికి చాటలేక చతికిలపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here