గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం విడిసి పిర్యాదు

గ్రామ సభలు నిర్వహించని కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్ కు బుగ్గారం విడిసి పిర్యాదు

తాజాకబురు బుగ్గారం:జగిత్యాల జిల్లా లోని మండల కేంద్రమైన బుగ్గారం గ్రామ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ లు గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బుగ్గారం గ్రామ పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన నిధులు – వాటి ఖర్చుల వివరాలు ప్రజలకు తెలియజేయడం లేదని ఆయన ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనులు జరుగడం లేదని, పారిశుధ్య పనులు కూడా సక్రమంగా నిర్వహించక పోవడం వలన ప్రజలు రోగాల పాలయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. త్రాగు నీటి సరఫరా కూడా సక్రమంగా జరుగడం లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గత ఆగస్ట్ 15న తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించి ఎలాంటి ఆదాయ – వ్యయాల, ప్రజా అవసరాల, మౌళిక వసతులు కల్పించుట గురించి చర్చించకుండానే అర్దాంతరంగా గ్రామ సభ ముగించారని ఆరోపించారు. ప్రజలు సమస్యల గురించి అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉండగా దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా గ్రామ సభ ఏర్పాటు చేయడం లేదన్నారు. ఇటీవల విడుదలైన మరుగుదొడ్ల నిధులు లబ్ధిదారులకు అందించడం లో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ, ఆలస్యంగా కొందరికి మాత్రమే అందజేశారని, ఇంకా అనేక మందికి మరుగుదొడ్ల నిర్మాణపు చెల్లింపులు జరగాల్సి ఉందన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై, పాలకులైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here