కాసులు మిల్లర్ కు…..! నష్టం రైతులకా..కష్టనష్టాల్లో రైతులను పట్టించునె నాధుడె కరువు..

కాసులు మిల్లర్ కు…..! నష్టం రైతులకా..కష్టాలనష్టాల్లో రైతులను పట్టించునె నాధుడె కరువు..

–మహితాపూర్ గనెగుట్ట ప్రాంతంలో కాలుష్యం వెదజల్లుతున్న బాయిలర్ రైస్ మిల్లు.

–కష్టాన్ని నమ్ముకున్న రైతులకు చుక్కలు చూపిస్తున్న మిల్లు యజమాన్యం.

–కాలుష్యంతో 50 ఎకరాల్లో పంటనష్టం అవుతున్న చలించని అధికారులు.

తాజా కబురు జగిత్యాల:ఎవరు ఏమైతే నాకేంటి…? నేను లాభాల బాట పడుతున్నానా… లేదా…? అన్నట్లు ఉంది ఓ బాయిలర్ రైస్ మిల్లు యజమాని తీరు. తాను నడుపుతున్న మిల్లు కాలుష్యంతో స్థానిక ప్రజలు, రైతులు నానా కష్టాలు పడుతున్న తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా కాలుష్యంతో పంట నష్టం సంభవిస్తుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోవాలని రైతులు ఆరాటపడుతున్న నేపథ్యంలో, ఒకపక్క ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మరోపక్క బాయిలర్ రైస్ మిల్లు నుండి వెదజల్లే పొగ, వేడినీరు, నల్లటి మసి వంటి దుమ్ము వల్ల వేసుకున్న పంట దిగుబడి రాకుండా పోతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లితుందని గత వారం కోరుట్ల రాయికల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

tajakaburu
tajakaburu

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామ శివారులో ఉన్న బాయిలర్ రైసుమిల్లు వల్ల చుట్టూ ఉన్న 50 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు నుండి వెదజల్లె బూడిద, నల్లని దుమ్ము, పొగ,వేడినీరు,ఇతర చెడు వ్యర్థాలు ఆ ప్రాంతంలో సాగుచేస్తున్న మొక్కజొన్న,వరి, మామిడి పంట పొలాలపైపడి పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయన్నారు. రైతులకు వాటినుండి వచ్చె వ్యర్థాల వల్ల పంటలన్ని ఎండిపోతున్నాయని,
ఎంత కష్టపడ్డ మిల్లు కాలుష్యం మూలంగా పంటలు చేతికి రావడం లేదని రైతులు లబో….దిబోమంటున్నారు.
ఈ మిల్లు ప్రాంతంలో వ్యవసాయ కూలీలు పనికి రావాలన్నా భయపడిపోతున్నారు. మిల్లు నుండి వచ్చే దుర్గంధాన్ని భరించలేక పని మధ్యలో మానేసి వెళ్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రైతు కూలీలు వెళ్ళిపోవడం మూలంగా వ్యవసాయ పనులు కొనసాగాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దాంతో‌ తమకు న్యాయం చేయాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. దాంతో తమకు న్యాయం జరగాలని కోరుతూ
జిల్లా కలెక్టర్ కార్యాలయం నకు, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో
మిల్లు ద్వారా వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు, కొన్ని రకాల యంత్రాలతో పాటు, మిల్లు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకోవాలి లాంటి నిబంధనలు పాటించకపోవడం పై 7‌ రోజుల్లో వివరణ ఇవ్వాలని
రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మిల్లు కు షోకాజ్ నోటీసును సైతం జారీ చేసినప్పటికీ,
మిల్లు యాజమాన్యం లో అధికార పార్టీ కి చెందిన నాయకుల భాగస్వామ్యం ఉండటం వల్ల రాజకీయ బలంతో బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు సైతం తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here