కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…

కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు…..

Tajakaburu
Tajakaburu

నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా…ఎలా…ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం ముగ్గురం‌ కలిసి అమ్మను కాపాడుదాం,ఇలా సంబాషణ జరుగుతున్న క్షణంలో ఒక్కసారిగా ఒక్క డోరు తెరుచుకోవటం జయంత్ బయటకు రావటం, కారు ఒక్కసారిగా మునిగిపోవటం,జయంత్ ఎన్నీ ప్రయత్నాలు చేసినా కారులో ఉన్నవాళ్ల అమ్మనాన్న,చెల్లిని కాపాడుకోకపోవటం క్షణాల్లో జరిగిపోయింది,ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో మృతిచెందిన సంఘటనలో చోటు చేసుకున్న విషాద ఆంశాలు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జొగిన్ పల్లి గ్రామానికి చెందిన కటికవేని అమరెంధర్,బార్య,శిరీషా,కొడుకు జయంత్ తో కలిసి హైదరాబాదు వెళ్లి స్వగ్రామంలో వెంకటేశ్వర స్వామీని దర్శించుకునెందుకు ఉదయం 5:40 నిమిషాల ప్రాంతంలో మేడిపల్లి మండల కేంద్రానికి చేరుకొని టర్న్ తీసుకున్నారు,మరో పదిహేను నిమిషాల్లో గ్రామంలోకి చేరుకొని గ్రామ శివారులో ఉన్న ఆలయం లో స్వామీవారిని దర్శణం చేసుకొచ్చు అనుకున్నారు,మేడిపల్లి పోలిసు స్టేషన్ దాటింది కారును అమరెంధర్ రావు నడిపిస్తున్నాడు, హైదరాబాదు నుండి రావడం అందులో రాత్రి అంత మెలుకువగా ఉండటం వల్ల నిద్రమత్తు ఆవహిస్తుంది,కళ్లు మూసుకుపోతున్నాయి,తాను గమ్యం చేరుకుంటున్నాను అనుకుంటు జొగన్ పల్లి వెళ్లె దారి అనుకొని పోలీసు స్టేషన్ దాటినాక వచ్చె మొదటి కెనాల్ దారిగా కారును పోనిచ్చాడు, ఆ దారి దాదాపుగా రైతులు వ్యవసాయ పనులకోసం వెళ్లటం కోసం వాడుతుంటారు, ఎక్కువ గుంతలు గుంతలుగా ఉంటుంది, కారు వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి కెనాలో పడిపోయింది, కెనాల్ లో నీరు ఎక్కువ ఉండటంతో కారు నేరులో లోపలికి వెళ్లింది,నాలుగు వైపుల కారు గ్లాస్ లు ఎక్కించి ఉండటంతో కారు కెనాల్ లో పడినా లోపలికి అంత తొందరగా నీరు చేరలేదు, ఆ ఒక్క రెండు నిమిషాల్లో జరిగిన సంఘటన,తన తల్లిదండ్రులు తన తోబుట్టువు మద్య సంభాషణ గురించి జయంత్ వివరించటం,ఒక్క జొగన్ పల్లి గ్రామానికి మాత్రమె కాదు జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది, అమరెంధర్ రావు చాలామంచి వ్యక్తి,గ్రామంలో సున్నితమైన మనస్కుడిగా పేరుంది,ఎవరైనా ఆపద వచ్చిందని వెళితె చేసిపెట్టెవాడు, గ్రామంలో వ్యవసాయ భూమి ఉండాలని భూమిలో వ్యవసాయ చేసుకుంటున్నాడు, వృత్తిరిత్యా జగిత్యాల జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ పబ్లీక్ ప్రాస్టిక్యూటర్ కావడం వల్ల అక్కడె స్థిరపడ్డాడు,కూతురు ఇంజనీరింగ్ అయిపోయింది మే నెలలో అమెకు వివాహం పెట్టుకున్నారు,ఇంతలో మృత్యువు ఒడిలోకి చేరిపోయారు, ముగ్గురు మృతి జిల్లావాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here