ఎంపి అరవింద్ చొరవతో …..ఎట్టకేలకు రేచపల్లి రోడ్డు మరమ్మత్తు ప్రారంభం

తాజాకబురు :సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ ప్రధాన రహదారి అద్వాన్నంగా తయారుకావటం వల్ల  గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిన క్రమంలో నిధులు మంజూరు అయిన టెండర్ ప్రక్రియ పూర్తయి జాప్యం చెయ్యటంతో అటు ప్రజలనుండి పలు విమర్శలు రావటం అలాగె , ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి గారు రేచపల్లి పర్యటనకు వచ్చినపుడు సారంగపూర్ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఎంపీకి రేచపల్లి రోడ్డు విషయం వివరించారు ఎంపీ అరవింద్  వెంటనే సంబంధిత అధికారులతో రోడ్డు జాప్యం గురించి మందలించి, వెంటనే పనులు మొదలు పెట్టాలి అని ఆదేశించారు..దాంతో అధికారులు రోడ్డు మరమత్తులు ప్రారంభించారని, ఈ సందర్బంగా ఎంపీ అర్వింద్ కు రేచపల్లి గ్రామ ప్రజలు బి జె వై ఎం మండల అధ్యక్షుడు దీటి వెంకటేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు ఏశాల రాజు,రేచపల్లి బూత్ అధ్యక్షులు సిరికొండ రఘు, పొచ్చన్న, తిరుపతి రెడ్డి, జంగిలి జగన్, సీనియర్ నాయకులు రాజు మరియు బీజేపీ సారంగపూర్ మండల నాయకులు మరియు కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here