ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..

ప్రేమికుల రోజు పండగ….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..

తాజాకబురు
తాజాకబురు

 

తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి, దు:ఖాన్ని మిగిల్చుతాయి, ప్రేమికులు తమ ప్రేమకు చిహ్నంగా జరుపుకునె రోజు ’’ప్రేమికుల రోజు’’ అదె వాలేంటెన్స్ డె, అందరు తమ ప్రేమను వ్యక్తికరించె రోజు, ఆ కుటుంబానికి మాత్రం ఓ పెద్ద పండగరోజు, అసలు ప్రేమికుల రోజుకు, ఆ కుటుంబానికి ఉన్న అనుభందాన్ని తెలుసుకోవాలంటె మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెళుదాం..

ఇక్కడ ఎంతొ అన్యోన్యంగా, సంతోషంగా ఒకరినొకరు మనసువిప్పి నవ్వుకుంటున్న వాళ్లను చూశారా వీళ్లు ఇద్దరు భార్యభర్తలు, కానీ ఓ పది సంవత్సారాల క్రితం వీరు కూడా స్వచ్చమైన ప్రేమికులె, అంగడి ఆనంద్ కుమార్, అక్షయలది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామం,  ఆనంద్ కాలేజ్ చదివె రోజుల్లో అక్షర ను ప్రేమించాడు, తాను ఫిబ్రవరి 14 రోజు జన్మించాడు కాబట్టి ఆ రోజె తన ప్రేమను ప్రపోజ్ చేశాడు,ఇద్దరి ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, ఫిబ్రవరి 14 రోజె వాళ్ల వివాహాం జరిగింది, ఇలా వాళ్లకు ఫిబ్రవరి 14 అనేది కుటుంబంలో ఒక భందమైంది,ఆ తర్వాత ఆనంద్ జీడ్స్ స్వచ్చంద సంస్థ నెలకొల్పింది, గ్రామంలో సర్చంచ్ గా బాధ్యతలు తీసుకుంది, ఆర్.యం.పి వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంబించింది, ఇలా చెప్పుకుంటు వెళితె చాటెడంతా అవుతాయి, అలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 రోజు తమ జీవితాల్లో వెలుగు నింపె కార్యక్రమాన్ని ఈ కుటుంబ సభ్యులు ప్రారంబిస్తారు, అందుకె ఆ ప్రాంతంలో వారి ఫ్యామిలీని చూసి అందరు ప్రేమికుల రోజు కుటుంబం అని అంటారు, ఆనంద్ పుట్టినరోజు ఫిబ్రవరి 14 కాబట్టి అందరు గ్రామంలో లవ్ కుమార్ అని, ప్రేమ కూమార్ అని పిలుస్తుంటారు, ఇప్పుడు వాళ్లిద్దరికి ఒక పాప, ఒక బాబు, వాళ్ల ప్రతి పండగను కూడా ఆ రోజు జరుపుకుంటున్నామని అంటున్నారు, ప్రేమించటం కాదు ఆ ప్రేమను దక్కించుకోవటం గొప్ప విషయమని, తమ కుటుంబానికి ఈ ప్రేమికుల రోజు ఎనలేని అనుభందం ఉందని అతను చెపుతుంటాడు, ఇంకో విషయమండి, ఫిబ్రవరి 14 రోజు ఇంట్లో అందరు కలిసి ఓ పండగనె జరుపకుంటారు, అలాగె ప్రతి సంవత్సం తాను ప్రేమను ప్రపోజ్ ఎలా చేసి ప్రేమలేఖ ఎలా ఇచ్చాడో అలాగె ఆ రోజు తన భార్యకు లవ్ లేటర్ ఇవ్వటం తనకు అలవాటు అని చెపుతున్నాడు,ఈ చూడచక్కని జంట పది సంవత్సరాల్లో ఎన్నో గొప్పగొప్ప కార్యక్రమాలు చేసింది, రక్తదానం, ఇంకా ఎన్నో సామాజిక సేవలను తమ స్వచ్చంద సంస్థ ద్వారా చేస్తున్నారు, అది కూడా తమకు అచ్చివచ్చిన ఫిబ్రవరి 14 రోజె…ఈ రోజు తమ జీవింతోల బాగమైందని, అందుకె ఏ మంచి కార్యక్రమం ఆరంబించిన ఈ రోజె మొదలు పెడుతామని చెపుతున్నారు ఈ కపూల్….ప్రేమను దక్కించుకోవటం వేరు దక్కించుకున్న ప్రేమను కలకాలం ఇసుమంత తగ్గకుండా ఒకరికొకరుగా ఉంటున్న ఈ ప్రేమికుల రోజు కుటుంబం ఇలాగె ఆనందంగా ఉండాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here