ప్రధాని మోడీ..జైలుకు ఎందుకు వెళ్లినట్లు..?

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అప్పట్లో వరుస టూర్లతో విదేశాలను చుట్టేసిన భారత ప్రధాని కరోనా మహమ్మారి నేపథ్యం లో విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారు.కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ 50వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకల కోసం వెళ్లారాయన సరిగ్గా అదే సమయంలో పశ్చి మబెంగా ల్ ఎన్నికల ప్రసహనం నడుస్తోంది.దాంతో ప్రధాని బంగ్లాదేశ్ పర్యటనపై రాజకీయ రచ్చ చెలరేగింది.బంగ్లాదేశ్ దేశానికి ప్రధాని వెళ్లడాన్ని పశ్చిమబెంగాల్ ఎ న్నికలతో ముడిపెట్టడమేంటి.?మరోవైపు బంగ్లాదేశ్ పర్యటనలో మోడీ,బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ,ఆ స్వాతంత్ర్యం కోసం తాను కూడా ప్రార్థించాననీ జైలుకు కూ డా వెళ్లాననీ సెలవిచ్చారు.ఇదెక్కడి రాజకీయం.?అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు.పా కిస్థాన్ నుంచి తూర్పు బెంగాల్ ప్రాంతం బంగ్లాదేశ్ అనే దేశంగా ఏర్పడే క్రమంలో యుద్ధం జరిగింది.అదీ భారత్-పాకిస్థాన్ మధ్య అయితే ఆ సెగ భారతదేశంలో ఎక్కడా లేదు.మరి నరేంద్ర మోడీ ఎందుకు జైలుకు వెళ్ళినట్లు.?ఈ అంశం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.ఇక మోడీ అంటేనే అబద్ధాల పుట్ట అని ఇంకో సారి నిరూపితమయ్యిందని కాంగ్రెస్ మద్దతుదారులు,ఇతర పార్టీలకు చెందిన మద్దతుదారులు నినదిస్తున్నారు.ఆ సమయంలో దేశంలో ఆందోళనలు జరి గినట్లు ఎ లాంటి రికార్డులు లేవని కొంత మంది సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నారు.తూర్పు పాకిస్థాన్‌ నుంచి విడిపోయి సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 1971 మార్చి 26న బంగ్లాదేశ్ పిలుపునిచ్చింది.ఆ తర్వాత రోజు వారి స్వాతంత్ర్య పోరాటానికి భారతదేశం పూర్తి మద్దతు ప్రకటించింది.పాక్‌,ఇండియాల మధ్య డిసెం బర్‌ 3 1971న యుద్ధం ప్రారంభమయ్యింది.13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన యుద్ధం పాక్‌ ఆర్మీ చీఫ్‌,సైన్యం భారత దళాల ముందు బేషరుతుగా లొంగిపోవడం తో ము గిసింది.అయితే పోరాటం అంతా సరిహద్దుల్లోనే సాగింది కానీ ఇండియాలో బంగ్లాదేశ్ విభజనకు మద్దతుగా ఆందోళనలు జరిగినట్లుగా వారిని అరెస్టులు చేసిన ట్లుగా ఎక్కడా లేదు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ బంగ్లాదేశ్ స్వేచ్చ కోసం తాను జైలుకెళ్లినట్లుగా ప్రకటించుకోగానే ఇటు సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here