ప్రభుత్వం చెప్పేది ఒకటి..అధికారులు చేస్తున్నది మరొకటి:జూడాలు

హైదరాబాద్:తెలంగాణలో జూనియర్ డాక్టర్లు,రెసిడెంట్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది.గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులు సహ.రాష్ట్రవ్యాప్తంగా కరోనా మినహ ఇతర అ త్యవసర సేవలను కూడా జూడాలు బహిష్కరించారు.సీఎం కేసీఆర్ సమ్మె వద్దు అని చెప్పినప్పటికీ,తమ డిమాండ్లు ఒప్పుకుంటేనే సమ్మె విరమిస్తామని జూడాలు స్పష్టం చేశారు.ప్రభుత్వ సెక్రటరీ చర్చలు జరుపుతున్నారు.మీకు అండగా ఉంటామని పేరుకు చెప్తున్నారు,కానీ ఆర్డర్ కావాలని జూడాలు కోరుతున్నారు.ప్రభుత్వం చెప్తున్నది ఒకటి.అధికారులు చేస్తున్నది ఒకటి అని జూడాలు మండిపడ్డారు.తాము తమ జీవితాలను ఫణంగా పెట్టి చికిత్స ఇస్తున్నామని.కానీ మా కుటుంబాలకే నిమ్స్ లో బెడ్ ఇవ్వకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.నోటి మాటలు చెప్తే అక్కడ బెడ్ ఇవ్వరని,ప్రభుత్వ ఆర్డర్ కావాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.తమ జీతాలు,స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వానికి సహకరిస్తామని కానీ నిమ్స్ లో తమ కుటుంబ సభ్యులకు చికిత్సతో పాటు కేంద్రం ప్రకటించిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరణిస్తే ఇచ్చే ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించకపోతే ఎలా అని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here