లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి,దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు.దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినా యకుని పూజించడం.ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్ర పటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక.ఇక్కడ మన ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మి దేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజచేసుకోవచ్చు.గోమాత శరీరంలో అందరూ దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు విదితమే.ఆవు యొక్క వెనుక భాగము (పృష్ఠము) లక్ష్మీ దేవి ఆవాస స్థానం.అందుకే మనం గృహప్రవేశం,గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము.బిల్వము లక్ష్మీ దే విచే సృజింప బడినది.ఆ చెట్టుకిందే ఆమె తపస్సు చేసింది.ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది.వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది.తామర పువ్వులు విశిష్టమైనవి,వీటితో లక్ష్మీ దేవికి పూజచేస్తే విశేష ఫలితం వస్తుంది.కారణం అవి ఆమె నివాస స్థానం.సు వాసినులు తమ పాపటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం.ఆ విధంగా ముసలి వారైనా స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరిలో ఉంది.అది త ప్పు.వివాహమైన ప్రతి స్త్రీ తన పాపటి యందు తప్పని సరిగా కుంకుమ ధారణ చేయాలి.దాని వల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది.ఆ ఇం టిలో ఎప్పుడూ సంపదలకు కొరత ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here