మాతృమూర్తులకు టీఎస్‌ఆర్టీసీ మ‌ద‌ర్స్ డే ఆఫర్‌..అదేమిటోతెలిస్తే..?

మంచిర్యాల:మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మాతృమూర్తులకు మరో ఆఫర్‌ ప్రకటించింది.మే 8వ తేదీన అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల్లో మాతృమూర్తులకు ఉచి త ప్రయాణం కల్పిస్తోంది.5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులు మాత్రమే అన్ని బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.అమ్మ అనురాగాన్ని,ప్రేమ‌ను వెల‌కట్టలేమని ఆ త్యాగ‌మూర్తి సేవ‌ల‌కు గుర్తింపుగా మ‌ద‌ర్స్ డేని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని క‌ల్పిం చినట్లు చెప్పారు.ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులంద‌రూ ప‌ల్లె వెలుగు నుంచి ఏసీ స‌ర్వీసుల వ‌ర‌కు అన్ని బ‌స్సుల్లో ఈనెల 8వ తేదీన ఈ ఉచిత ప్రయాణాన్ని కొన‌సాగించ‌వచ్చని వారు స్ప ష్టం చేశారు.టీఎస్‌ఆర్టీసీ క‌ల్పిస్తున్న ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here