ఇది చెరువుకాదు..కలెక్టరేట్ ఆఫీస్‌ ఎక్కడంటే..?


రాజన్న సిరిసిల్ల:గులాబ్‌ తుపాను వల్ల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి.వాగులు,వంకలు పొంగడంతో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తిం ది.దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ మరోసారి వరద నీటిలో చిక్కింది.కలెక్టరేట్‌ భవనం పక్కనే ఉన్న క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నివాసం ఉంటున్నారు.ఆ యన మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలను పరిశీలించడంతో పాటు బాధితుల పరామర్శకు సిద్ధమయ్యారు.కానీ చుట్టూ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులో బయటకు రావడం సాధ్యం కాలేదు.దీంతో ట్రాక్టర్‌ తెప్పించుకుని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బయటకు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here