కాంగ్రెస్‌ గూటికి..కన్హయ్య కుమార్,జిగ్నేష్ మేవాని

0
320

న్యూఢిల్లీ:ఢిల్లీ జీఎన్‌యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరియు గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమి టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.ఆ ఇద్దరు నేతలు భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్‌ను కలుసుకున్నారు.చేతులు కలుపుతూ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.దీనికి ముందు,కన్హయ్య కుమార్‌కు పార్టీలోకి స్వాగతం పలుకుతూ ఢిల్లీలోని కాంగ్రెస్ కా ర్యాలయం ముందు పోస్టర్లు వెలిశాయి.కాగా కన్హయ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా బీహార్‌లోని తన హోమ్‌టౌన్ బెగుసరాయ్ నుంచి పోటీ చేశారు.కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.మరోవైపు.జిగ్నేష్ మేవాని గుజరాత్ ఎమ్మెల్యేగా వడ్గాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ ఇద్దరు యువ నే తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చర్చగా మారింది.ఇక వీరు పార్టీలో చేరడాన్ని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ స్వాగతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here