పొంచి ఉన్న ముప్పు..థర్డ్ వేవ్ తప్పదు:విజయ రాఘవన్

న్యూఢిల్లీ:కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అల్లాడుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలో కరో నా థర్డ్‌వేవ్ అనివార్యమని అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లు కూడా వస్తాయన్నారు.అయితే ఈ థర్డ్ వేవ్ ఎప్పుడు సంభవిస్తుందో మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నారు.వైరస్‌లో ఏర్పడే మార్పులను ముందుగా అంచనా వేసి వాటికి అనుగుణంగా వ్యాక్సిన్‌లను ఎప్పటికప్పు డు అప్‌డేట్ చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్రాల పరిస్థితి దారుణం:లవ్ అగర్వాల్ బెంగళూరు,చెన్నై,గురుగ్రామ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు.దేశంలో కరోనా పాజిటివ్ రేట్ పెరగడం ఆందోళన కలిగిస్తోందని,13 రాష్ట్రాల్లో రోజుకు 100 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు.12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయని,కరోనా కేసుల్లో 2.4 శాతం వృద్ధి రేటు కనిపిస్తోందన్నారు.కర్నాటక,బెంగాల్,బిహార్,ఏపీ,తమిళనా డు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని,కేసులు తక్కువగా ఉన్న చోట కంటైయిన్‌మెంట్‌పై దృష్టి నిలపాలని ప్రభుత్వాలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here