ఆ వార్తలో నిజం లేదు..ఆర్‌బీఐ

There is no truth in that news..RBI

ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ ఖండించింది.ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ,బ్యాం కునోట్ల లో మార్పు ఉండదని వివరణ ఇచ్చింది.కొత్త కరెన్సీ నోట్లపై విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్,మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోందని, కేంద్ర ఆర్థిక శాఖ,ఆర్బీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వచ్చాయి.ఫోటోల డిజైన్లను కేంద్రం ఆమోదించినట్టు వార్తలు వైరల్‌ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here