హుజూరాబాద్‌ ఉపఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులు

కరీంనగర్:హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది.ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే హుజురాబాద్‌లో ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.తాజాగా నామినేషన్‌ ఉపసంహరణ గడువు కూడా నేటితో పూర్తయింది.దీంతో ఉప ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారో తేలిపోయింది.హుజారాబాద్‌ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు బరి లో నిలిచారు.అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ తరఫు నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్,బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌,కాంగ్రెస్‌ నుంచి బల్మూరి వెంకట్‌ నర్సింహారావుతో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.ఇవాళ 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 30 మంది మిగి లారు.ఇంకొంత మందిని నామినేషన్‌ ఉపసంహరించుకోవాల ని ప్రధాన పార్టీలు కోరినా,వాళ్లు పోటీలో ఉండటానికే మొగ్గు చూపారు.దీంతో 30 మంది మిగిలారు.హుజూరాబాద్ నియోజకవర్గం ఉప పోరులో మొత్తం 61 మంది నామినేషన్స్‌ దాఖ లు చేశారు.పలువురు ఇండిపెండెంట్స్‌ సరైన పత్రాలు లేకుండా నామినేషన్స్‌ దాఖలు చేయడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి నామినేషన్లను తిరస్కరించారు.నేటితో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోయింది.దీంతో ఎంత మంది బరిలో ఉన్నారనే సంగతి తేలిపోయింది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ధీమాపై ప్రధాన ప్రతిపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నా యి.టీఆర్‌ఎస్‌,బీజేపీ,కాంగ్రెస్‌ గెలుపు అస్త్రాన్ని సంధించేందుకు ప్ర యత్నాలు చేస్తున్నాయి.ఓటర్లను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు అభ్యర్థులు.ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌,బీజేపీ మధ్యనే ఉన్నా కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇవ్వాలని యత్నిస్తోంది.గెలుపు కోసం పార్టీలు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here