ధరణి పోర్టల్‎ సమస్యలపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి:ఎన్‌హెచ్‌ఆర్‌సీ

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించడానికి ధరణి పోర్టల్‎ను అందుబాటులోకి తెచ్చింది.దీనిలో సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత జాతీయ మానవ హ క్కుల సంఘం లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది.ధరణిలోని సమస్యలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారని,కొందరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో పెద్ద సంఖ్యలో భూములు ఉన్నాయని,తద్వారా చట్టబద్ధమైన రైతులు తమ భూములను కొనుగో లుదారులకు విక్రయించే హక్కును నిరాకరించారని.ఇది భారీ స్కామ్ కాబట్టి నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసినట్లు బక్క జడ్సన్ తెలిపారు.ధరణి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆ దేశించాలని కోరారు.ఫిర్యాదు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ధరణిలో సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు,పోర్టల్‌ అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్‎ను ఆదేశించిం ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here