మర్డర్ కేసు ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి..చిక్కుల్లో పోలీసులు..

మంచిర్యాల:సర్వ సాధారణంగా ఎవరైనా నేరం చేసినా ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు.అయితే మనిషి చేసిన నేరా నికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు నాశనం చేస్తే ఎలా ఉంటుంది.అదీ పోలీసులు ఎంతో కష్టపడి సేకరించిన ఓ హత్యకు సంబంధించిన కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోతి దొంగిలిస్తే ఏ విధం గా ఉంటుంది ఊహకు అందని విషయం కదా.హత్యాయుధంతో పాటు ఓ కేసుకు సంబంధించిన మరో 15 సాక్ష్యాలను కోతి దొంగిలించింది.పోలీసులు 2016నాటి కేసుకు సంబంధించిన తాము సేక రించిన సాక్ష్యాధారాలను బ్యాగ్ లో పెట్టి ఆ బ్యాగ్ ను కోర్టు ఆవరణలోని చెట్టు కింద ఉంచారు.ఓ కోతి ఆ బ్యాగ్ ను తీసుకుని పారిపోయింది.ఈ విచిత్ర ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.జైపూర్‌ లోని ట్రయల్ కోర్టులో రాజస్థాన్ పోలీసులు ఈ వాంగ్మూలం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తేపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2016 సెప్టెంబర్‌లో చందవాజీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శశికాంత్‌ శర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహం లభ్యమైన తర్వాత, మృతుడి బంధువులు ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ జైపూర్-ఢిల్లీ హైవేను దిగ్బంధించారు.ఐదు రోజుల తర్వాత,పోలీసులు చాంద్‌వాజీ నివాసితులు రాహుల్,మోహన్‌లాల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. హత్యానేరం కింద పోలీసులు వారిద్దరి నీ జిల్లా అదనపు జడ్జి కోర్టులో హాజరుపరిచారు.అయితే కోర్టులో సాక్ష్యాలను సమర్పించే సమయం వచ్చినప్పుడు,ఒక కోతి హత్య సాక్ష్యాలను దొంగిలించిందని పోలీసులు చెప్పారు.ప్రాథమిక సాక్ష్యం గా ఉన్న కత్తిని కూడా కోతి తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు.*ఈ ఘటన ఎలా జరిగిందంటే*ఈ హత్యాకేసుకు సంబంధించిన సాక్ష్యాలను బ్యాగ్‌లో ఉంచామని,వాటిని కోర్టుకు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు.అందులో కత్తితో పాటు మరో 15 ముఖ్యమైన ఆధారాలను కూడా ఉంచారు.మల్ఖానాలో స్థలం లేకపోవడంతో సాక్ష్యాధారాలతో కూడిన సంచిని చెట్టుకింద ఉంచారు.అయితే వి చారణ సమయంలో కోర్టు ఆధారాలు సమర్పించాలని పోలీసులను కోరగా అప్పుడు తాము సేకరించిన అధరాలు బ్యాగ్ లో పెట్టినట్లు ఆ బ్యాగ్‌ని కోతి దొంగిలించిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దొంగిలించబడిన వస్తువులలో హత్యాయుధం (రక్తంతో తడిసిన కత్తి) ఉందని చెప్పారు.ఈ సమాచారాన్ని పోలీసులు కోర్టు ముందు లిఖితపూర్వకంగా కూడా సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here