కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్:సీతక్క

హైదరాబాద్‌:కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె శాంతియుతంగా నిరసన తెలిపారు.అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఉచిత అంబులెన్స్‌ స ర్వీసులను అందుబాటులోకి తేవాలని ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించాలని డిమాండ్‌ చేశారు.కరోనా మృతుల అంత్యక్రియలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here